తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు తెలుగు రాష్ట్రాల నుంచే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అలాంటి వారిలో అలనాటి హీరోయిన్ దివ్యవాణి కూడా ఒకరు ఈమె గుంటూరు జిల్లా ప్రాంతానికి చెందిన నటి. బాలనాటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సర్దార్ కృష్ణమనాయుడు చిత్రంలో కృష్ణ కుమార్తెగా నటించింది. అలా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.ఇక హీరోయిన్గా కూడా పలు చిత్రాలలో నటించింది ఇప్పటివరకు ఈమె 40 కు పైగా చిత్రాలలో నటించింది.
ఈమె నటించిన చిత్రాలలో పెళ్లి పుస్తకం, మొగుడు పెళ్ళాల దొంగాట చిత్రాలు మంచి గుర్తింపును అందుకున్నాయి. దివ్యవాణి అతి చిన్న వయసులోనే వివాహం చేసుకుంది .దేవానంద్ అని బిజినెస్ మాన్ ను వివాహం చేసుకున్న ఇమేకు ఇద్దరు పిల్లలు కూడా.. కొడుకు కిరణ్ కాంత్ కాగా, కూతురు తరుణ్యాదేవి ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తోంది దివ్యవాణి. పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు దూరంగా ఉన్న ఈమె పదేళ్ల తర్వాత రాధాగోపాలం అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత పంచాక్షరి వీర మహానటి సినిమాల ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ తో బాగానే ఆకట్టుకుంది.
ఇటీవలే దివ్యవాణి తన భర్తకు దూరంగా ఉంటున్నట్లు కొన్ని రూమర్లు వినిపించాయి. వీరిద్దరి మధ్య పలు విభేదాలు కారణంగా దూరమయ్యాయి అంటూ వార్తలు వైరల్ గా మారడంతో.. తాజగా ఇంటర్వ్యూలో మాట్లాడిన దివ్యవాణి తన భర్త నుంచి అసలు విడిపోలేదని ఇలాంటి వార్తలను ఏ నిజం లేదని కేవలం బిజినెస్ పనుల్లో తాను బిజీగా ఉన్నారని తెలిపారు. దీంతో ఎక్కువగా ఇంట్లో ఉండరు. ఆయన నా నిర్ణయాలను ఎప్పుడు నివారించలేదు. ముఖ్యంగా మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారని తెలిపింది దివ్యవాణి.