ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే కొంతమంది నటీనటులకు మంచి స్నేహబంధాలు ఉంటాయి ఇదే సమయంలో మరి కొంత మంది దర్శకులకు హీరోయిన్లకు మధ్య కూడా మంచి స్నేహ బంధాలు ఉంటాయి.. అయితే కొంతమంది హీరోయిన్లు సైతం ప్రత్యేకించి దర్శకులకు మాత్రమే కనెక్ట్ అవుతూ ఉంటారు దీంతో పలు రకాల విషయాలలో వీరు వైరల్ గా మారుతూ ఉంటారు. అలా వైరల్ గా మారిన జంట గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.
పూరి జగన్నాథ్- ఛార్మి:
జ్యోతిలక్ష్మి సినిమాకు చార్మి పూరి జగన్నాథ్ కలిసి పనిచేశారు అయితే ఈ సినిమాతో మొదలైన పరిచయం ఇప్పటికీ వీరి పరిచయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
త్రివిక్రమ్-పూజా హెగ్డే:
అరవింద సమేత సినిమా నుంచి వీరిద్దరి కాంబినేషన్ మొదలయ్యింది ఆ తర్వాత అలా వైకుంఠపురం సినిమాలో కూడా నటించారు .ప్రస్తుతం మహేష్ సినిమాలో కూడా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి మధ్య పలు రూమర్స్ కూడా వినిపించాయి.
రష్మిక-వెంకీ కుడుముల:
చలో సినిమాతో వీరి కాంబినేషన్ మొదలయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాలు కూడా చేయడం జరిగింది.
సాయి పల్లవి -శేఖర్ మాస్టర్:
టాలీవుడ్లోకి ఫిదా సినిమాతో మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ శేఖర్ మాస్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తరువాత వీరి కాంబినేషన్లోనే లవ్ స్టోరీ సినిమా కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
అనిల్ రావిపూడి- మెహ్రిన్
ఎఫ్2 చిత్రంతో వీరు బాండింగ్ మొదలైన ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో అవకాశాన్ని కల్పించారు.అంతేకాకుండా మెహ్రిన్ అనిల్ రావిపూడి మధ్య పలు రూమర్స్ కూడా వినిపించాయి.
కాజల్ అగర్వాల్- తేజ:
డైరెక్టర్ తేజ లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలతో కాజల్ కలిసి పలు సినిమాలను తెరకెక్కించారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇలాంటి కాంబినేషన్కు మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇలాంటి కాంబినేషన్ వల్ల పలు రూమర్లు కూడా వినిపిస్తూనే ఉంటాయి.