బాహుబలిపై నో కామెంట్.. శంకర్ ఎందుకిలా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సౌత్ లో నెంబర్ 1, 2 డైరక్టర్స్ ప్రస్థావనకు వస్తే శంకర్, రాజమౌళి అని టక్కువ చెప్పేస్తారు. ప్రాంతీయ సినిమాగా ఉన్న సినిమాలను ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకునేలా చేసిన ఈ ఇద్దరు దర్శకులు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటారో తెలుసుకోవాలని ఫ్యాన్స్ కు ఉంటుంది. ఈ విషయంలో రాజమౌళి ఎప్పుడు శంకర్ గురించి అడిగినా ఆయన గొప్ప దర్శకుడని చెబుతాడు.

అయితే శంకర్ మాత్రం ఎప్పుడు రాజమౌళి గురించి మాట్లాడింది లేదు. రోబో సీక్వల్ గా వస్తున్న 2.ఓ ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో బాహుబలి ప్రస్థావన తెచ్చినా మాట మార్చి వేరే విషయాలు చెప్పాడే తప్ప బాహుబలిపై, రాజమౌళి పై కామెంట్ చేయలేదు. రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూలో శంకర్ బాహుబలి ప్రస్థావన వచ్చిన రెండు సార్లు డైవర్ట్ చేసి 2.ఓ టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్, కాస్టింగ్ గురించి చెప్పుకొచ్చాడు.

2000 కోట్లు వసూలు చేసిన బాహుబలి గురించి ఓ మాట మాట్లాడేస్తే పోయేది ఏముంది. శంకర్ ఎందుకిలా చేశాడో అని బాహుబలి ఫ్యాన్స్ డిస్కస్ చేస్తున్నారు. శంకర్ అయినా ఒకటి రెండు సినిమాలు నిరాశ పరచాడు కాని రాజమౌళి మాత్రం వరుస హిట్లు కొడుతూనే ఉన్నాడని శంకర్ మీద కామెంట్స్ చేస్తున్నారు.

Share.