పునీత్ బయోపిక్ పై స్పందించిన దర్శకుడు సంతోష్ ఆనంద్?

Google+ Pinterest LinkedIn Tumblr +

కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో యావత్ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైన విషయం తెలిసిందే. ఇక పునీత్ అతను చేసిన గొప్ప గొప్ప పనులు అతని మరణాంతరం అందరికీ తెలిసాయి. అంతే కాకుండా అతను చనిపోయిన తరువాత సేవా కార్యక్రమాలు ఆగిపోకూడదు అని తాను చేసే సేవా కార్యక్రమాల కోసం ఎనిమిది కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన గొప్ప వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. అలాంటి అలాంటి వ్యక్తి బయోపిక్ రానుంది అంటూ కన్నడ నాట పుకార్లు వచ్చాయి.

తాజాగా ఈ విషయాలపై దర్శకుడు సంతోష్ ఆనంద్ రామ్ స్పందించారు.పునీత్ చనిపోయిన తరువాత పునీత్ అభిమాని ఆయన బయోపిక్ నిర్మించే ఆలోచన ఉందా అని ట్విట్టర్లో ప్రశ్నించగా.. బయోపిక్ తీయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని దర్శకుడు సంతోష్ తెలిపారు.

పునీత్ అభిమానులు సంతోష్ ని పునీత్ బయోపిక్ తో రండి అని ట్వీట్ చేసారట, మరొక అభిమాని దయచేసి మా అప్పు సార్ బయోపిక్ తీయండి.. అతని మంచితనాన్ని రేపటి తరానికి చాటుదాం అని రాసుకోవచ్చారట. ఇలా సోషల్ మీడియా వేదికగా పునీత్ అభిమానులు ఆయన బయోపిక్ రావాలి అనే ఆలోచనను స్వాగతించారట.

Share.