తెలుగు ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు గారు సినిమా అంటే అందులో హీరోయిన్స్ హైలెట్ గా చేసే సీన్లు చాలానే ఉంటాయని చెప్పవచ్చు .రాఘవేంద్రరావు కొత్త హీరోయిన్ ని పరిచయం చేసి ఆమెకు తగ్గట్టు సినిమాలను ఎంపిక చేసుకుని వాటికి తగ్గట్టే హీరోయిన్లను అందంగా కనిపించేలా చేసే గుణం ఆయనకు ఉంది. అలాగే చాలామంది హీరోయిన్స్ రాఘవేంద్ర రావు సినిమాలో గ్లామర్ గా కనిపించడం జరుగుతూ ఉంటుంది.
మరీ చెప్పాలంటే ఆయన చేతిలో పడ్డాక శిల శిల్పం కావాల్సిందే అనేలా తీర్చిదిద్ది హీరోయిన్లను ఆయన సినిమాల్లో చూపిస్తారు. ఒకవైపు సినిమాలకు డైరెక్షన్ చేస్తూనే మరోవైపు ఎంతోమందినీ డైరెక్టర్లుగా కూడా తీర్చిదిద్దారు. ఒకప్పటి శ్రీదేవి నుంచి ఇప్పటి శ్రీలీల వరకు ఆయనే ఇండస్ట్రీకి పరిచయం చేశాడనే చెప్పాలి.
అయితే తాజాగా రాఘవేంద్రరావు డైరెక్షన్లో వస్తున్న చిత్రం సర్కార్ నౌకరీ. ఇందులో హీరోగా సింగర్ సునీత కొడుకు నటిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్‌ను హైదరాబాదులో నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా హీరోయిన్ భావన రాఘవేంద్రరావు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తాను ఒక ప్రైవేట్ సంస్థల ఉద్యోగినని అలాగే తనకు సినిమాల మీద మక్కువ ఉండటంతో థియేటర్ ఆర్టిస్టుగా చేరాను… కానీ అనుకోకుండా నాకు ఈ సినిమాలో ఛాన్స్ దక్కింది. రాఘవేంద్రరావు గారికి టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే మోజు ఇంకా తీరలేదు.
అందుకేనేమో మాలాంటి వారికి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే ఆయన వల్ల ఎంతోమంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారని ఆమె తెలిపింది.
భావన వ్యాఖ్యల అర్థం తమలాంటి కొత్త తరాన్ని ఆయన బాగా ప్రోత్సహిస్తున్నారు అన్నది.. అయినా ఆమె మోజు తీరుస్తున్నారు అని మాట్లాడడంతో నెటిజన్లు సరదాగా భావన కామెంట్స్ కు సెటైర్లు వేస్తున్నారు.