మహేష్ బాబుతో మరో మూవీకి సిద్ధమైన బాలయ్య డైరెక్టర్.. క్లారిటీ ఇదే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలయ్య డైరెక్టర్ అనగానే తాజాగా గుర్తొచ్చే పేరు అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఆయన బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇక ఈ సందర్భంగా డైరెక్టర్ కి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన మహేష్ బాబుతో మళ్లీ సినిమాకు సిద్ధమైనట్లు ఒక వార్త నెట్టింట చాలా వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే ఒకవైపు మహేష్ బాబు గుంటూరు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయబోతున్నారనే వార్త ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ఎందుకంటే మహేష్ బాబుతో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇక ఈ సినిమాతో ఆయన ఈసారి పక్కాగా రెండు మూడు ఆస్కార్ అవార్డులను పొందే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందుకు తగ్గట్టుగానే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా గట్టిగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మహేష్ బాబు సినిమాలపై క్రేజీ న్యూస్ రావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అసలు విషయంలోకి వెళితే ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోవడానికి చాలా సమయం పడుతుంది. అటు రాజమౌళి కూడా ఈ ఏడాదంతా మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ లోపు ఇంకో సినిమా చేయాలని మహేష్ బాబు ఆలోచిస్తున్నాడట. టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి ఆయన సిద్ధమైనట్లు సమాచారం.అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి మాట్లాడుతూ మా ఇద్దరి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి సక్సెస్ అయ్యింది. ఆయనతో మరో సినిమా తీసే అవకాశం కూడా నాకు ఉంది. కానీ ఆయన 29వ సినిమా నేను చేస్తున్నట్టుగా వచ్చిన వార్తలలో నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

Share.