తెలుగు సినీ ఇండస్ట్రీలోకి దిల్ రాజు నిర్మాతగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కానీ ప్రొడ్యూసర్ కాకముందు ఆయన ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా. ఇప్పటికీ కొన్ని చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యంగా నైజాం, వైజాగ్, కృష్ణ వంటి పలుచోట్ల పలు స్టార్ హీరోల సినిమాలను తీసుకొని విడుదల చేస్తూ ఉంటారు.ఇలా ప్రతి ఏడాది తన ప్రొడ్యూస్ చేసిన సినిమాలతో కలిపి ఏడాదికి 21 పైగా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి.
గతంలో ఒకసారి సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వకూడదని కామెంట్స్ చేశారు ఇప్పుడు అదే విషయాన్ని పట్టుకున్న నిర్మాత మండలి వారసుడు డబ్బింగ్ సినిమా కాబట్టి తక్కువ థియేటర్లలో విడుదల చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయం పై చర్చలు నడుస్తున్న నేపథ్యంలో చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాల తర్వాత తమ సినిమానే నని దిల్ రాజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక 2017లో విడుదలైన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ,మహేష్ స్పైడర్ సినిమాలో థియేటర్లో చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యాయని తెలిపారు.
ఈ రెండు సినిమాలకు డిస్ట్రిబ్యూట్ చేసింది తానే కావడంతో భారీ నష్టాలను ఎదుర్కొన్నట్లుగా తానే స్వయంగా తెలియజేస్తున్నారు. అయితే అదే ఏడాది తనకు ప్రొడ్యూసర్ గా వరుస హిట్లు రావడంతో కాస్త తట్టుకొని నిలబడ్డారని తెలిపారు. అలాంటి సమయంలో ఇతర ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకుని ఉండేవారని లేదంటే ఇండస్ట్రీ నుంచి పారిపోయే వారిని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇక వారసు సినిమా అన్ని ప్రమోషన్స్ ను తమిళంలోని చేస్తున్నారు .తెలుగులో ఇంకా మొదలుపెట్టలేదు. మరి దిల్ రాజు చేసిన వ్యాఖ్యల పైన స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.