మా బ్యానర్ లో మొదటి సారి అలా జరిగింది: దిల్ రాజు

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజ్ తరుణ్ హీరోగా అనీష్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా లవర్. కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాజ్ తరుణ్ సినిమాలైతే చేస్తున్నాడు కాని ఆడియెన్స్ ను అలరించడంలో విఫలమయ్యాడు. దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా సినిమా అంటే కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా నిర్మాణం పెద్ద లాసే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దిల్ రాజు.

మా సంస్థలో తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసిన సినిమా లవర్. మా బ్యానర్ లో మొదటి సారి ఇంత తక్కువ మొత్తం లో సినిమా పూర్తి చేయటం, అయితే మా సంస్థ కి ఉన్న విలువ దృష్ట్యా 8 కోట్ల వరకు ఖర్చు పెట్టాం అని చెప్పారు రాజు. రాజ్ తరుణ్ రేంజ్ 4 కోట్లయితే దానికి డబుల్ బడ్జెట్ దీనికి కేటాయించాము. తమ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఏ సినిమా రిలీజ్ ముందు లేని టెన్షన్ ఈ సినిమాకు ఉందని అన్నారు దిల్ రాజు. అంతేకాదు రాజ్ తరుణ్ తో సినిమా అంటే హీరోయిన్స్ విషయంలో కూడా కష్టాలే అన్నారు దిల్ రాజు.

మొత్తానికి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన దిల్ రాజు రాజ్ తరుణ్ సినిమా నిర్మించాడు. అయితే ఆ సినిమా రిలీజ్ ముందే రిజల్ట్ తెలిసిపోయింది అనుకుంటా అందుకే ఏమాత్రం ఆశాజనకంగా మాట్లాడలేదు.

Share.