చిరంజీవి చిత్రాన్ని కృష్ణ నిర్మించారని తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

వెండితెరపై ఒకప్పుడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోలలో కృష్ణకూడ ఒకరు. అప్పట్లో నటించిన సినిమాలన్నీ ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన అభిమానులు తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో సినిమాలను చేస్తూ ఇప్పటి హీరోలకు ఏమాత్రం తగ్గకుండా నటిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి వీరిద్దరూ అనేక పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిచి తెలుగు ఆడియన్స్ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

Chiranjeevi pays tribute to Super Star Krishna మాటలకు అందని విషాదం ఇది:  చిరంజీవి

ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి సినిమాని నిర్మించాడు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఆ సినిమా ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణ నిర్మాతగా మారి చిరంజీవి ఇంతటి రేంజ్ కు రావడానికి ఆ ఒక్క సినిమానే కారణమని చెప్పవచ్చు. అదేంటంటే ఖైదీ చిత్రం..1983 లో రిలీజ్ అయింది. దీన్ని కోదండరామిరెడ్డి డైరెక్టర్ చేశారు. ఇందులో డాన్సులు ఫైట్స్ ఈ సినిమా సక్సెస్ సాధించడానికి ఒక మెట్టు అని చెప్పవచ్చు.

చిరంజీవికి ఇది ఫస్ట్ కమర్షియల్ హిట్ కావడమే కాకుండా స్టార్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమాని తెలుగులోనే కాకుండా హిందీలో కూడా 1984లో రీమిక్స్ చేయబడింది. ఈ సినిమా రీమిక్స్ నిర్మాత మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ ఆయన పద్మాలయ స్టూడియో బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. హిందీలో చిరంజీవి పాత్రలో జితేంద్ర నటించిన మాధవి హీరోయిన్గా నటించినది.సుమలత రోల్ నీ హేమమాలిని పోషించారు.ఈ సినిమాకి దర్శకత్వం వహించింది ఎస్ఎస్ రవిచంద్ర. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ను అందుకొని సూపర్ స్టార్ కృష్ణకు నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపును కూడా తెచ్చి పెట్టింది.

అంతేకాకుండా చిరంజీవికి కృష్ణకి కూడా మంచి స్నేహబంధం ఉండేది.. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ గా కూడా చిరంజీవి పని చేయడం జరిగింది. కృష్ణ గార్ అంటే అభిమానం ఉండడం చేతే చిరంజీవి అప్పటికీ ఇప్పటికీ కృష్ణాను అభిమానిస్తూ ఉంటారు.

Share.