టాలీవుడ్లో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా కొన్ని సంవత్సరాలపాటు స్టార్ హీరోల సినిమాలకు కూడా డేట్లు అడ్జస్ట్ చేయలేని స్థితిలో ఉండేది.. ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో రకుల్ ప్రీతిసింగ్ క్రేజ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ పలు సినిమాలలో నటించి బిజీ హీరోయిన్గా మారిపోయింది. కానీ అక్కడ కూడా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.
సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా ఒక ఊపు ఊపేసిన రకుల్ ప్రీతిసింగ్.బాలీవుడ్లో ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తోంది. అయితే రకుల్ కూడా ఇప్పుడు స్టార్ హీరోల పైన పలు రకాల కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.తాజగా ఒక ప్రముఖ బాలీవుడ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఇందులో సౌత్ లో అవకాశాలు తగ్గిపోవడానికి గల కారణాన్ని తెలియజేసింది.. రకుల్ ప్రీతిసింగ్ మాట్లాడుతూ తనకు టాలీవుడ్లో చాలా మంచి ఫ్రేమ్ వచ్చింది అక్కడే తనకు ఎక్కువగా అవకాశాలు కూడా రావడం జరిగిందని తెలిపింది.
కానీ కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో తాను ఒక సినిమాలో సీనియర్ హీరోతో కిస్ సీన్లలో నటించాను దాన్ని ఆడియన్స్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయారు.. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అప్పటినుంచి తనకు చాలా సౌత్ లో సినిమా అవకాశాలు తగ్గిపోయాయని తెలిపింది. అయితే ఈమె చేసిన కామెంట్లు నాగార్జున ఉద్దేశించే అంటూ పలువురు అక్కినేని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మన్మధుడు-2 చిత్రంలో రకుల్ ప్రీతిసింగ్ నాగార్జున మధ్య రొమాన్స్ సన్నివేశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి.
వీరిద్దరి మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు కాకుండా శృతి మించి రొమాన్స్ కూడా ఉండడంతో అప్పట్లో ఈ సినిమా పైన పలు రూమర్లు కూడా వినిపించాయి. ఇక రకుల్ ప్రీతిసింగ్ కి అవకాశాలు తగ్గడానికి ముఖ్య కారణం నాగార్జుననే అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.