తెలుగు, తమిళ్, కన్నడ అని తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ త్రిష. హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలోనే అందరూ అగ్ర హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్గా పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ. అప్పట్లో త్రిషకు ఎక్కువగా కుర్రకారుల ఫ్యాన్ ఫాలోయింగ్ వుండేది. బ్లాక్ బస్టర్ చిత్రాలలో హీరోయిన్గా నటించింది. ముఖ్యంగా అప్పట్లో త్రిష ధరించే ఎలాంటి దుస్తులైనా సరే ట్రెండీగా మారుతూ ఉండేవి. మొదటిసారి త్రిష నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోవడం జరిగింది. ఇక ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాలో నటించి ఈమెకు మరింత స్టార్డం తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సిద్ధార్థ తో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. త్రిష పేరు కూడా మరింత పాపులర్ అయింది. ఇక తర్వాత అతడు, కృష్ణ వంటి సినిమాలతో విజయాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మకి తెలుగులో ఇప్పుడు అవకాశాలు రావడం లేదు.
కేవలం తమిళ సినిమాలలోనే నటిస్తూ బిజీగా ఉంటోంది. అయితే తెలుగు ఇండస్ట్రీకి త్రిష దూరం అవ్వడానికి కారణం ఒక స్టార్ హీరో తండ్రి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి.. టాలీవుడ్ లో ఒక బడా నిర్మాత కొడుకుతో ప్రేమలో ఉందట. ఈ విషయం ఆ నిర్మాతకు తెలియడంతో త్రిషకు సినిమాలలో అవకాశం రాకుండా..ఆ నిర్మాత త్రిష కు గట్టి వార్నింగ్ ఇచ్చారట. అయితే ఈ విషయం జరిగి నాలుగేళ్లు అవుతున్న ఇప్పటికీ కూడా ఈమె తెలుగులో నటించలేదు. ఇక ఆచార్య సినిమాలో త్రిష కు అవకాశం వచ్చినా ఆమె నో అని చెప్పడంతో కాజల్ ను తీసుకోవడం జరిగింది. ఇక కాజల్ ను కూడా తప్పించి అందులో పూజా హెగ్డే నటించడం జరిగింది.