తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని అనతి కాలంలోనే స్టార్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న రామిరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . 1989లో రాజశేఖర్ హీరోగా వచ్చిన అంకుశం సినిమా ద్వారా విలన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన నటనతో నంది అవార్డును సొంతం చేసుకున్న ఈయన ఈ సినిమాలో రామిరెడ్డి పోషించిన క్యారెక్టర్ అందరికీ నచ్చడంతో ప్రతి నాయకుడిగా ఆయనకు వరుసపెట్టి అవకాశాలు రావడం జరిగింది. అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ విలన్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.
ముఖ్యంగా విలన్ అంటే ఇలా చేయాలి అని.. ఆయనను చూసి ఎంతోమంది విలన్ క్యారెక్టర్లు చేయాలనుకునేవారు.. ఆయనను చూసి నేర్చుకునే వారు. తెలుగు మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా సత్తా చాటిన ఈయన తమిళ్ , మలయాళం , భోజపురి భాషల్లో కూడా తన మార్క్ చూపించారు. 250కి పైగా చిత్రాలలో నటించిన రామిరెడ్డి ఆయన చివరి చిత్రం మర్మం. ఎక్కువగా ప్రతి నాయకుడి పాత్రలో కనిపించిన ఈయన పెద్దరికం, అనగనగా ఒక రోజు లాంటి సినిమాలలో టిపికల్ రోల్స్ చేశారు. ముఖ్యంగా ఒసేయ్ రాములమ్మ, వీడు మనవాడే,జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా , నాగ ప్రతిష్ట, అడవి చుక్క, అనగనగా ఒక రోజు , తెలుగోడు లాంటి సినిమాలు ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో సినిమాలలో నటించి విలన్ పాత్రలు చేసి భారీ పాపులారిటీ దక్కించుకున్న రామిరెడ్డి చివరి దశలో మాత్రం ఎంత ఘోరంగా చనిపోయారు తెలిస్తే ఆశ్చర్యపోతారు. కాలేయ సంబంధ వ్యాధి కారణంగా 55 ఏళ్ల వయసుకే 2011 ఏప్రిల్ 14వ తేదీన రామిరెడ్డి కన్నుమూశారు . ముఖ్యంగా వ్యాధి బారిన పడినప్పటి నుంచి నరకం అనుభవించిన ఈయన గుర్తుపట్టలేనంతగా సన్నగా మారిపోయి… ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. సినీ ఇండస్ట్రీలో ఉన్నతంగా బ్రతికిన ఈయన ఇలా అనారోగ్య సమస్యల కారణంగా మరణించడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.