వారు కొరటాల శివాని మోసం చేశారా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో రైటర్ అంటే చాలా తక్కువగా చూస్తూ ఉంటారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఏ రైటర్ కూడా హ్యాపీగా ఉండరు. అయితే అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివ ఆయన రైటర్ గా ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా తెలియజేయడం జరిగింది. కొరటాల శివ కెరియర్ మొదట్లో రైటర్ గా చేసినప్పుడు ఆయన ఒక డైరెక్టర్ దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఒక సినిమాకి ఆయన కథ మాటలు ఇస్తే ఆ డైరెక్టర్ కథకి నా పేరు వేయించుకుంట డైలాగ్ కి నీ పేరు వేయిస్తానని చెప్పారట. దీంతో చేసేదేమీ లేక కొరటాల శివ ఓకే అని చెప్పారట.

Koratala Siva - Wikipedia

ఆయనతో చేసిన ఇంకొక సినిమా సేమ్ ముందులాగే సినిమా కథ నాది మాటలు నీవి అని టైటిల్ వేయిస్తా అని చెప్పారట. దీంతో విపరీతమైన కోపానికి గురైన కొరటాల శివ వాళ్ళు చెప్పిన దానిని ఒప్పుకోలేదట.నేను రాసుకున్న కథకి నీ పేరు ఎలా వేసుకుంటావని గొడవ పెట్టుకున్నారట. అయితే ఆ గొడవ జరిగిన తర్వాత కొరటాల శివ గారు అక్కడి నుంచి కోపంగా స్టోరీ డైలాగ్స్ రెండింటిలోనూ నా పేరు వేస్తే వేయండి లేకపోతే మొత్తానికి తీసేయండి అంటూ బయటికి వచ్చేసారట.

దీంతో ఆ డైరెక్టర్, కథ డైలాగులలో కొరటాల శివ పేరు లేకుండా కేవలం తన పేరు మాత్రమే వేయించుకున్నారట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయం రివిల్ చేయలేదు. ఆయన గురించి అడిగితే వాడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాడి పాపాన వారే పోతారు అని చెప్పారట కొరటాల శివ. అలా ఆ డైరెక్టర్ మీద కోపంతోనే డైరెక్టర్గా మారానని చెప్పారు. మంచి సినిమాలు తీసి బాగానే గుర్తింపు పొందారు కొరటాల శివ. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక సినిమాను చేయబోతున్నారు.

Share.