తెలుగు సినీ పరిశ్రమలో ఒక చెరగని ముద్ర వేసుకుంది హీరోయిన్ సౌందర్య. ఎంతోమంది హీరోల సరసన నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది సౌందర్య. అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన సౌందర్య సినిమాలు విడుదలయ్యాయి అంటే చాలు ఎంతోమంది అభిమానులు థియేటర్లకు వెళ్లి చూసేవారు. ఇప్పటికీ కూడా ఈమె సినిమాలు బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే చాలు ఎంతో మంది అభిమానులు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా కేవలం చీరకట్టులోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సౌందర్య. సౌందర్య మృతి చెంది ఇప్పటికి 17 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అభిమానులలో మాత్రం ఇంకా జీవించే ఉన్నది. 2004లో విమాన ప్రమాదంలో మృతి చెందిన సౌందర్య గురించి ఇప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.
ప్రముఖ నటులలో ఒకరైన మానస కోటేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం. తాను నటించిన చిత్రాలలో ఎక్కువగా తక్కువ పాత్ర గల సినిమాలలోని నటించానని తెలిపారు కోటేశ్వరరావు. అయితే అలా నటించడానికి గల కారణం ఏమిటంటే తనకు ఎక్కువగా లెంతీ సినిమాలలో నటిస్తే భయం వేసేదట. ముఖ్యంగా అవుట్ డోర్ షూటింగులు ఎక్కువ రోజులు ఉంటే తాను ఆ సినిమాలలో నటించే వాడిని కాదని తెలియజేశారు.
ఒకసారి శివశంకర్ సినిమా షూటింగ్ సమయంలో ఒక లైక్ మ్యాన్ పైనుంచి సౌందర్య కూర్చున్న పక్కన పడ్డారని పైనుంచి ఏదో శబ్దం విని ఆమె అక్కడి నుంచి పక్కకు వెళ్లిందని అలా 15 అడుగుల నుంచి ఆ వ్యక్తి కింద పడ్డారని కోటేశ్వరరావు తెలియజేశారు. అయితే ఈ సంఘటనలు మరో రెండు చోట్ల చోటు చేసుకున్నాయని తెలియజేశారు. ఈ సంఘటనలు సౌందర్యం మరణించడానికి కొన్ని రోజుల ముందు జరిగినట్లు తెలియజేశారు. సౌందర్య నటించిన చివరి చిత్రం శివశంకర్ కాగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన ఫ్లాప్ ని చూసింది.
అయితే సౌందర్య లాంటి నటి ఇప్పటివరకు ఏ హీరోయిన్ ఆ మార్కును అందుకోలేరని ఎంతోమంది ప్రముఖులు సైతం తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో సౌందర్య అంతటి నటి దొరుకుతుందేమో చూడాలి మరి. సౌందర్య ఎలాంటి పాత్రలోనైనా సరే జీవించిపోయి నటించేది.