తెలుగు సినీ పరిశ్రమలో నటీనటుల జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో .. ఎవరము చెప్పలేము ..ఒకప్పుడు మంచి పాపులారిటీ సంపాదించుకున్నవారు ఇప్పుడు అసలు ఎక్కడున్నారో కూడా ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలోకి వెళ్లిపోయారు.. అలా కనుమరుగైపోయిన హీరోయిన్ల లో అల్లు అర్జున్ నటించిన వేదం సినిమా హీరోయిన్ దీక్ష సేతు కూడా ఒకరు. ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు చెరగని ముద్ర వేసుకుంది.
వేదం సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. టాలీవుడ్లో కుర్ర హీరోలు సైతం ఈమెను జోడిగా ఎంపిక చేసుకోవడం జరిగింది. అలా గోపీచంద్ వాంటెడ్, రవితేజ నిప్పు, ప్రభాకర్ రెబల్ వంటి సినిమాలలో నటించింది. అయితే ఈమె నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి దీంతో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ కు మాత్రం అభిమానులు ఫిదా అయ్యారు. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ అని చూసి టాలీవుడ్ కత్రినా కైఫ్ అని కూడా పిలుస్తూ ఉండేవారు.
అయితే ఆ తరువాత తెలుగులో మంచు మనోజ్ నటించిన ఉలిక్కిపడతారా అనే సినిమాలలో నటించింది. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడు టాలీవుడ్లో అసలు నటించలేదు ఇక బాలీవుడ్ నుంచి మూడు సినిమాలలో నటించిన అవి కూడా డిజాస్టర్ గా మిగిలాయి. చివరికి కన్నడలో దర్శన్ సరసన జగ్గు భాయ్ సినిమాలో నటించింది.. ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఈమె కెరియర్ లో ఎక్కువ ఫ్లాప్లే ఉన్నాయని ఐరన్ లెగ్ గా అనే ముద్రను వేసుకుంది..
టాలీవుడ్ లో ఇమే సినిమాలు చేస్తున్న సమయంలో టైర్-2 యంగ్ హీరో ఆమెను బాగా హెరాస్ చేశారని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ హీరోతో ఆమె మంచిగా ఉండేందుకు ట్రై చేసిన అతడు మాత్రం ఆమెను హెరాస్ చేస్తూ ఉండడంతో తట్టుకోలేక ఇండస్ట్రీకి దూరమైందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇమే లండన్లో ఐటి ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరనే విషయాన్ని అభిమానులు ఆరాధిస్తున్నారు.