ఏ ఇండస్ట్రీలోనైన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన హీరోయిన్స్ ఉన్నారు.. అంతేకాకుండా దీనిపై చాలామంది హీరోయిన్స్ ఎదుర్కొన్న సమస్యల గురించి రీసెంట్ గానే తెలిపారు. ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ వస్తే దర్శక నిర్మాతలు హీరోలు వారి కోరికలు తీర్చమని వేధిస్తారు అన్న సంగతి ఇప్పుడే కాదు..ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉందనే విషయాన్ని చాలామంది తెలియజేయడం జరిగింది..అంతేకాకుండా ఈ విషయంపై చాలామంది హీరోయిన్స్ ప్రూఫ్ గా కూడా నిరూపించారు. అయితే ఇది కాస్త పక్కన పెడితే
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ పొజిషన్లో ఉన్న సమంత కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిందా అంటే అవుననే వాదన వినిపించింది. ఎందుకంటే సమంత చదువుకునే టైంలోనే హీరోయిన్ అవ్వాలనుకుందట.ఆ టైంలోనే యాడ్స్ కూడా చేసేదట. అదే టైంలోనే ఓ స్టార్ డైరెక్టర్ నీకు అవకాశం ఇస్తాను నా కోరిక తీర్చు అని వేధించాడట. ఆ తర్వాత మళ్లీ చదువులో కొనసాగుతుండగా ఏం మాయ చేసావే అనే సినిమా ఛాన్స్ ను గౌతమ్ మీనన్ సమంతకి పిలిచి మరీ అవకాశాన్ని ఇచ్చారట. ఈ సినిమా సక్సెస్ కావడంతో సమంత జాతకం మొత్తం మారిపోయింది.
ఎందుకంటే తనకు ఈ సినిమా వల్లే మంచి మంచి అవకాశాలు అందుకోని ఇప్పటికీ తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలుతోంది. ఆ తరువాత సమంతను కోరిక తీర్చమన్న డైరెక్టర్ తన దగ్గరకు వచ్చి మేడం నా సినిమాలో చేయండి అని చేతులు పట్టుకొని బ్రతిమాలాడట. అప్పుడు సమంతకు అర్థమైందట. ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చునీ.. ఈ విషయం సమంత తన స్నేహితులకు చెప్పడం జరిగిందట. సమంత ఎలా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందని తెలిసి అభిమానులు సైతం ఆ డైరెక్టర్ ఎవరో అంటూ కూడా ఆలోచిస్తున్నారు.