టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్లలో నటి సదా ఒకరు.. ఈమె నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. మొట్టమొదటిగా జయం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో నితిన్ నటించాడు. ఈ సినిమాలో గోపీచంద్ విలన్ పాత్రలో పోషించాడు. ఈ సినిమాలో సదా అచ్చ తెలుగు అమ్మాయిల అద్భుతంగా నటించింది. అయితే ఇందులో ఒక్క డైలాగ్ ఉంది అదే “వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ సదా చెప్పటం” నితిన్ వెళ్ళటం ఇలా ఈ సినిమా అంతా ఆ డైలాగుతోనే ఫేమస్ అయ్యింది.
ఇకపోతే సదా తెలుగుతో పాటు తమిళ భాష చిత్రాల్లో కూడా అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవటంతో బుల్లితెర కార్యక్రమాలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా సదా కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.సదా మొదటి సినిమా జయం అందులో డైరెక్టర్ తేజ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలియజేసినట్లు సమాచారం.
కన్నీళ్లు పెట్టుకున్న సరే డైరెక్టర్ తనని కనుకరించలేదని తెలిపింది. ఇంతకు సదా అంత బాధ పడేలా డైరెక్టర్ తేజ ఏం చేశారు అనే విషయానికి వస్తే జయం సినిమా సెకండ్ హాఫ్ లో నితిన్ కోసం సదా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నితిన్ ని కలుసుకుంటుంది. అదే సమయంలోనే గోపీచంద్ వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని సదా బుగ్గని గోపీచంద్ నాలుకతో నాకుతాడు ఆ సీన్ చేయటానికి సదా ఏమాత్రం ఇష్టపడలేదట.
కానీ డైరెక్టర్ మాత్రం ఈ సన్నివేశం సినిమాకే హైలెట్ అవుతుందని తప్పనిసరిగా నటించాల్సి ఉంటుంది అంటూ కరాకండిగా చెప్పటంతో ఆమె తనకు ఇష్టం లేకపోయినా ఈ సన్నివేశం లో నటించారని తెలుస్తోంది. అయితే ఈ సీన్ తర్వాత సదా 10 సార్లు తన ముఖాన్ని కడుక్కుందట. అలా ఆ సన్నివేశం చూసినప్పుడల్లా గుర్తొస్తూ ఉండేదట. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.