తెలుగు ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. గత కొద్ది రోజులుగా తమన్నా బాలీవుడ్ నటుడుతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతోంది అంటూ కొన్ని వార్తలు వినిపించాయి. దీనికి తోడు విజయ్ వర్మతో న్యూ ఇయర్ రోజు లిప్ లాక్ చేస్తూ కనిపించింది. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి పలు చిత్రాలలో కూడా బోల్డ్ గా నటిస్తున్నారు.
వీరి ప్రేమాయణం కాస్త పక్కన పెడితే.. ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారంటు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో తమన్నా అమ్మగారు విజయ వర్మ కి పెట్టిన కండిషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. మామూలుగా కూతురు ఉన్న తల్లిదండ్రులు చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. అయితే తమన్నా వాళ్ళ అమ్మ ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా మా బిడ్డకు ఇష్టమైతే మాకు ఇష్టమే అని తేల్చి చెప్పేసిందట.
కానీ విజయ్ వర్మ కు ఒక కండిషన్ పెట్టిందట తమన్నాకి ఇష్టం లేని పని ఏది చేయకూడదని..తమన్నా మొదటినుంచి సెన్సిటివ్ ఆమెను బాధ పెట్టకుండా చూసుకోవాలి. అంతేకాదు మొదటి నుంచి తమన్నాకి చెప్పింది వినకపోతే చాలా మొండిగా ప్రవర్తిస్తుందనీ ఆమె చెప్పినట్టు వినకపోతే కొట్టను కూడా కొడుతుంది. వీటన్నింటికీ నువ్వు రెడీగా ఉండాలి. మా బిడ్డకి ఇష్టం లేకుండా ముట్టుకోను కూడా ముట్టుకోకూడదు అంటూ ఓపెన్ గానే తమన్నా తల్లి చెప్పుకొచ్చిందట.
చాలామంది ఇలాంటి కండిషన్ లను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? అంటూ బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు తమన్నా కొట్టిన కొట్టించుకోవాలా ఏమైనా విజయ్ వర్మ చిన్నపిల్లవాడ అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై తమన్నా, నటుడు విజయ వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.