బుల్లితెర యాంకర్ గా కలర్స్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది హీరోయిన్ స్వాతి. ఈ షో ద్వారా స్టేటస్ ను దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు తన ఇంటిపేరుగా కలర్స్ గా మార్చుకొని కలర్ స్వాతిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు అవకాశాలను అందుకుంది. ఈమె ఒక తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ భాషలలో కూడా కొన్ని సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. స్వాతి మొట్టమొదటిగా తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ మంచి సక్సెస్ను అందుకున్న తరువాత తెలుగులో డేంజర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
అయితే మొట్టమొదటి సినిమా తనకి అంత పెద్ద సక్సెస్ తెచ్చి పెట్టలేదు.. ఆ తర్వాత నానితో నటించిన అష్టా చమ్మ సినిమాతో ప్రత్యేక స్థానాన్ని తెలుగు ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఆ తరువాత కార్తికేయ, స్వామి రారా, గోల్కొండ హై స్కూల్, లాంటి సినిమాల్లో నటించింది. కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక రెండు సినిమాలలో నటించింది.
ఏమైందో తెలియదు గానీ హీరోయిన్గా గుడ్ భై చెప్పి పెళ్లి అనే బంధంలోకి అడుగు పెట్టింది. ఈమధ్య కాలంలోనే ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వబోతోంది అన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇది కాస్త పక్కన పెడితే కలర్ స్వాతికి ఒక హీరో తో సినిమాలు చేయకూడదని వార్నింగ్ ఇచ్చారట. ఇంతకు ఆ హీరో ఎవరో కాదు నిఖిల్. ఎందుకంటే వారిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. అలాగే సక్సెస్ కూడా అయ్యాయి. అయితే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ ఇండస్ట్రీలో అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించేవి.
ఈ విషయం తెలుసుకున్న స్వాతి కుటుంబ సభ్యులు నిఖిల్ తో ఇంకో సినిమా చేస్తే నిన్ను చంపేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారట .దాంతో కలర్ స్వాతి శంకరభరణం అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అడ్వాన్స్ కూడా తీసుకున్నదట.. తన కుటుంబ సభ్యులు బెదిరించడంతో సినిమాల క్యాన్సిల్ చేసుకుని అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.