బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది యాంకర్ శ్రీముఖి.. ఆ తర్వాత వెండితెర కి ఎంట్రీ ఇచ్చింది కానీ అక్కడ పెద్దగా సక్సెస్ సాధించలేదు. అయితే లైఫ్ ఈజీ బ్యూటిఫుల్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి ఆ తరువాత జులాయి సినిమాలో కూడా నటించి కాస్త పేరు తెచ్చుకుంది. అయితే సినిమాలతో ఏ క్రేజీ సంపాదించుకోలేదు. కానీ మొట్టమొదటిగా అదుర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా పరిచయమైన శ్రీముఖి పలు షోలలో యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
అయితే స్టార్ యాంకర్ కావాల్సిన శ్రీముఖి కెరీర్ ని ఓ డైరెక్టర్ నాశనం చేశారంటు గతంలో కొన్ని వార్తలు వినిపించాయి. ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరనుకున్నారు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్. అవును మీరు విన్నది నిజమే త్రివిక్రమ్ వల్లే శ్రీముఖి స్టార్ యాంకర్ కాలేకపోయిందట.. అసలు విషయంలో వెళితే అల్లు అర్జున్తో నటించిన జులాయి సినిమాలో శ్రీముఖి చేసింది చెల్లెలు పాత్ర అయితే ఆ సినిమా తర్వాత బుల్లితెరపై యాంకర్ గా రాణించే టైం లో త్రివిక్రమ్ శ్రీముఖి ఫోన్ చేసి నువ్వు అలా బుల్లితెరపై రాణిస్తే నీకు వెండితెరపై అవకాశాలు తగ్గిపోతాయి. తగ్గిపోవడమే కాదు అసలు అవకాశాలే రావు.
నువ్వు వెండితెర మీదే ఉంటే హీరోయిన్గా అవకాశాలు చాలా బాగా వస్తాయని చెప్పటంతో ఆయన మాటలు నమ్మిన శ్రీముఖి వెండితెరపై ఫోకస్ పెట్టింది. ఇక ఆ టైంలోనే బుల్లితెర చాన్సులన్నీ కోల్పోయి మళ్లీ ఇప్పుడు అదే బాట పట్టింది. అయితే వెండితెరపై అవకాశాల కోసం ఎదురుచూసింది కానీ అవకాశాలు పెద్దగా రాలేదు.. వచ్చినా అవకాశాలన్నీ అంతగా సక్సెస్ కాలేదు. ఇక వేరే దిక్కు లేక మళ్ళీ బుల్లితెర వైపే ఎక్కువ మక్కువ చూపుతోంది శ్రీముఖి. ఇప్పుడు ఉన్న యాంకర్లలో శ్రీముఖి ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పవచ్చు.