టాలీవుడ్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో సిద్ధార్థ్ -అతిధి రావు హైదరి. ఇక వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం పైన ఇప్పటి వరకు వీరిద్దరూ స్పందించలేదు. కానీ తాజాగా నటుడు శర్వానంద్, రక్షితా రెడ్డి నిశ్చితార్థ వేడుకలలో జంటగా కనిపించి సిద్ధార్థ్ -అతిధి షాక్ ఇచ్చారు.దీంతో అభిమానుల సైతం వీరిద్దరూ కలిసి ఉంటున్నారు.అనే విషయాన్ని నమ్మశక్యంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరిద్దరూ పార్టీలు ,టూర్లు , వెకేషన్స్ అంటూ తిరగడం జరుగుతోంది.
అయితే ఇంతవరకు తమ డేటింగ్ విషయంపై ఏ విధంగా క్లారిటీ ఇవ్వలేదు. గతంలో కూడా అతిధి పుట్టినరోజు వేడుక సందర్భంగా సిద్ధార్థ ఆమెతో సన్నిహితంగా ఉండే ఫోటోలను సైతం షేర్ చేస్తూ హ్యాపీ హ్యాపీ బర్తడే ప్రిన్సెస్ అంటూ హార్ట్ సింబల్స్ ని కలిగి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. అలా తరచూ వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ శర్వానంద్ ఎంగేజ్మెంట్ వేడుకలలో వీరిద్దరూ జంటగా కల్పించడంతో వీరి అసలు విషయం బయటపడిందని చెప్పవచ్చు.
సిద్ధార్థ్ -అతిధి దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రిలేషన్షిప్ పైన క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులతో సైతం పలువురు నిటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.త్వరలో వీళ్ళు కూడా వివాహం చేసుకోబోతున్నారేమో అంటూ పలువురు నెటిజన్లు తెలియజేస్తున్నారు.సిద్ధార్థ్ -అతిధి, శర్వానంద్ మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. దీని తప్పు నుంచి వీరందరి మధ్య మంచి సన్నిహితం ఉన్నట్లుగా సమాచారం.సిద్ధార్థ్ -అతిధి ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా తెలియజేస్తారేమో చూడాలి మరి.