టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి మేడ్ ఫర్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న విషయం విని అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం షాక్‌కు గురయ్యారు. విరు మాత్రమే కాదు సాధారణంగా సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవటం సహజం కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలామంది ఏడాది కూడా కలిసి ఉండకుండా కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకుంటారు. అంతేకాకుండా మరీ కొంతమంది సెలబ్రిటీలు చేప్పుడు మాటలు విని కూడా వివాహ బంధానికి దూరం అవుతుంటారు.
గతంలో సమంతా ఫ్యామిలీ మ్యాన్ అనే ఓ వెబ్ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కారణంగానే సమంత, నాగచైతన్య మధ్య గొడవ మొదలైందని గతంలో రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా వీరిద్దరు విడిపోవడానికి గల కారణం ఇదే అని సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతోంది. కానీ సమంత, నాగచైతన్య మాత్రం విడిపోవడానికి గల అసలు కారణం మాత్రం బయటకి చెప్పటం లేదు.
తాజా సమాచారం ప్రకారం వెబ్ సిరీస్ నుంచే వారిద్దరకు గొడవలు వచ్చాయంటూ ఆ సమయంలోనే నాగచైతన్య, సమంత మీద ఉన్న ద్వేషంతో మరో హీరోయిన్‌తో క్లోజ్ గా ఉన్నట్టు సమాచారం. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదండోయ్… శోభిత ధూళిపాల ఈ విషయాన్ని సమంతా సన్నిహితులే ఆమె వద్ద చెప్పారట. దీంతో చెప్పుడు మాటలు విన్నటువంటి సమంత ,నాగచైతన్య కి దూరమయ్యిందట. ఇక విడాకులు తీసుకున్న తర్వాత సమంతా అనారోగ్యానికి గురైంది.. ఆ టైంలో అయినా సమంత, నాగచైతన్య మళ్లీ కలుస్తారేమో అని వార్తలు వినిపించాయి. అయితే ఇంతవరకు వారిద్దరూ కలిసి నట్టు ఏ వార్త రాలేదు. మరి రాబోయే రోజుల్లో సమంత, నాగచైతన్య కలిసి సినిమాలలో నటిస్తారేమో చూడాలి మరి.