ఆదోశం వల్లే సమంత చైతన్య విడిపోయారా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీ లో మోస్ట్ పాపులారిటీ ఉన్న ఫ్యామిలీ లలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి.. అక్కినేని నాగార్జున వారసులుగా నాగచైతన్య ,అఖిల్ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.. నాగ చైతన్య విషయానికి వస్తే అడపాదప సినిమాలను చేసి ఇండస్ట్రీలో కాస్త ముందుకు సాగుతున్నాడు. నాగచైతన్య ప్రేమించి సమంతాను పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే..వీరి వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ జంట మధ్య మనస్పర్ధలు రావడం జరిగింది..

Revealed! Here's why Naga Chaitanya, Samantha got divorced

ఈ మనస్పర్ధలు కారణంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇప్పటికే వీరు విడాకులు తీసుకొని దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోంది. అయినా కూడా ఎక్కడో ఒకచోట వీరి విడాకుల విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతునే ఉంటుంది.అయితే తాజాగా సమంత ,నాగచైతన్య విడాకుల గురించి మరో వార్త వైరల్ గా మారుతోంది..ఈ మధ్యనే సమంత ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.. అయితే ఈ సినిమా సమంత నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్న వార్తలు వినబడుతున్నాయి.

ఈ సినిమాలో సమంత ,విజయ్ దేవరకొండ పెళ్లికి సమంత తండ్రి అడ్డుపడతారు..ఎందుకంటే వీరి జాతకంలో నాడి కూట దోషం ఉంది. పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం కలిసి ఉండరని పిల్లలు కూడా పుట్టారంటూ చెబుతారు.అయినా కూడా వాళ్ళ మాటలు వినకుండా సమంత, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ సినిమాలో చూపించిన విధంగానే సమంత నిజజీవితం కూడా వీరి జాతకంలో దోషాలు ఉన్నాయని అందుకే సమంత, నాగచైతన్య ఇద్దరు విడిపోయారు అంటూ మరొక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

అయితే ఈ విషయాన్ని అక్షరాల వేణు స్వామి కూడా తెలియచేశారట. ఈ మాటలను అక్కినేని ఫ్యామిలీ లైట్ తీసుకొని వీరిద్దరికి వివాహం జరిపించారు. ఫలితం సమంత ,నాగచైతన్య విడిపోవడం జరిగింది.. ఒక వేల దోశ నివారణా చర్యలు చేపట్టి ఉంటే వీరిద్దరూ కలిసి ఉండే వారేమో అని పలువురు అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు.

Share.