టాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..తాను నటించిన మొదటి సినిమా ఫిదా తోనే అందరినీ అలరించిన హీరోయిన్ సాయి పల్లవి మొదటి చిత్రంతోనే తన అందంతో డ్యాన్స్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. సాయి పల్లవి గురించి చెప్పాలంటే అనుకువ, నటన, డాన్స్ తో ప్రతి సినిమాలో మెప్పించింది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి ఇప్పటివరకు సౌత్ సినిమాలకే పరిమితమైన సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. బాలీవుడ్ నటుడైన రన్ బీర్ కపూర్ తో కలిసి నటించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రన్ బీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు.ఈ సినిమాలో రావణుని పాత్రలో హృతిక్ రోషన్ కనిపించబోతున్నట్లు సమాచారం.సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తుందంటే ఇక ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనవసరం లేదు.. ఈ సినిమా 2023 సంవత్సరంలో సెట్ మీదికి వెళ్లబోతున్నట్లు సమాచారం. ఇక సాయి పల్లవి టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ రేంజ్ కి ఎదిగిందని ఆమె అభిమానులు ఎంతగానో ఆనందాన్ని తెలియజేస్తున్నారు.
కానీ సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తున్నట్లు అధికార ప్రకటన రావాల్సి ఉంది. గత కొద్ది కాలంగా సాయి పల్లవి సినిమా వైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని వార్తలు వినిపిస్తున్నాయి. చాలామంది సినిమాలకు గుడ్ బై చెప్పిందేమోననే వార్తలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది సాయి పల్లవి డాక్టర్ గా కొనసాగుతుందేమోనని ప్రచారం కూడా జరుగుతోంది.కానీ తనకు డాక్టర్ కావాలని కోరిక కూడా ఉన్నది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం ఉందో తెలియాల్సి ఉంది.
చెప్పాలంటే ఒక సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సాయి పల్లవికి వరుస ఆఫర్లు వస్తున్నాయి.అంతేకాకుండా సాయి పల్లవి సినిమాలు సక్సెస్ అయినా కాకపోయినా ఆమెకున్న క్రేజ్ అలాగే ఉంది.ఆమెని అభిమానించే అభిమానుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆమెకి అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా సాయి పల్లవి క్రేజ్ బాగానే పెంచుకుంది. మరి తను నటించే సినిమాల పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.