ఏంటి రకుల్ కు రెండుసార్లు వివాహం అయ్యిందా.. నిజమేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా బిజీ హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. అంద చందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది. అలా వచ్చిన పాపులారిటీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా అక్కడే సినిమాలు నటిస్తూ ఉండడంతో సౌత్ ప్రేక్షకులు ఇమేను మర్చిపోయారు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది రకుల్ ప్రీతిసింగ్.

Rakul Preet Singh to Soon Tie the Know With Jackky Bhagnnai? Know the Truth  - News18

రకుల్ ప్రీతిసింగ్ ఇండియా వైడ్ గా మంచి పాపులారిటీ అయితే సంపాదించింది. ఎంతోమంది హీరోల సరసన నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది రకుల్ ప్రీతిసింగ్. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడంతో టాలీవుడ్లో స్టార్ స్టేటస్ ని కోల్పోయి అక్కడ స్టార్ స్టేటస్ ను దక్కించుకోలేకపోయింది రకుల్ ప్రీతిసింగ్. దీంతో ఈమె కెరియర్ ప్రస్తుతం అయోమయంలో పడే పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం వల్ల ఈమె కరియర్ మరింత దెబ్బతినిందని చెప్పవచ్చు. అయితే పర్సనల్ విషయాలలో ఎల్లప్పుడూ నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ నిర్మాత నటుడు జాకి భగ్నానితో గత కొద్దిరోజులుగా రిలేషన్ లో ఉన్నా విషయాన్ని తెలియజేయడం జరిగింది.వీరిద్దరూ దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారనీ..త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.

ఇలా చాలాసార్లు ఈ వార్తలు రావడంతో రకుల్ ప్రీతిసింగ్ ఈ వార్తల పైన స్పందిస్తూ మా ప్రేమ విషయాన్ని దాచడానికి మేము ఇంకా చిన్న పిల్లలం కాదు అందుకే మాకేం భయం లేదు కాబట్టి మేము ఆ విషయాన్ని తెలియజేశాము మేము సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు చాలాసార్లు వార్తలు వినిపించాయి గత ఏడాది ఆగస్టులో ఒకసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని వార్తలు వినిపించాయి.. దీంతో సోషల్ మీడియా వారు మాకు రెండుసార్లు సీక్రెట్ గా పెళ్లి చేశారంటూ ఫన్నీగా తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.

Share.