బాలకృష్ణ తాజాగా ఆన్ స్టాపబుల్ షో కి ప్రభాస్ గోపీచంద్ లను పిలిచి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. నిన్నటి రోజున ఒక ప్రోమో విడుదల చేసి మరింత పాపులర్ అయ్యేలా చేశారు. మొత్తానికి ఆహా టీమ్ బిగ్ అప్డేట్ ఇచ్చి స్ట్రిమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. ప్రోమో మొత్తం అదిరిపోయే అంత ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ముందుగా ఉప్పలపాటి ప్రభాస్ రాజు న్యాయదేయస్య బహు పరాక్ అంటూ గూస్ బంప్స్ తెప్పించే బాహుబలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో స్వాగతం పలికారు. లెజెండ్ సినిమాలోని పాపతో ఏదో ఒకసారి మామయ్య అని అడిగిన విధంగా ప్రభాస్ తో అలా పిలిపించుకుంటున్నారు. తనను ప్రేమగా డార్లింగ్ అని పిలవాలని బాలయ్య మొదట కండిషన్ పెట్టారు. దీంతో ప్రభాస్ సరేలే డార్లింగ్ సార్ అని పిలిచారు. డార్లింగ్ కి సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే మొన్న మధ్య శర్వానంద్ కూడా వచ్చారని తెలిపారు బాలయ్య.
శర్వానంద్ పెళ్లెప్పుడు అంటే ప్రభాస్ పెళ్లి తర్వాత అన్నాడని.. బాలకృష్ణ అనగా నేను సల్మాన్ తర్వాతే అనాలేమో అంటూ చాలా ఫన్నీగా మాట్లాడాడు ప్రభాస్. నీ లైఫ్ లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏంటి అని అడగగా చాలా ఇబ్బంది పడ్డాడు ప్రభాస్. ఇలా ప్రభాస్ బాలయ్య మధ్య కాస్త గోల గోలగా చేశారు ఆ తర్వాత బాలకృష్ణ రామ్ చరణ్ కి కాల్ చేసి ప్రభాస్ ని ఆటపట్టించారు. ఆ తర్వాత గోపీచంద్ ఎంట్రీ ఇచ్చారు.అలా ఎంట్రీ ఇస్తూనే చరణ్ ఒక చిన్న న్యూస్ ఇచ్చారని బాలకృష్ణ అనగా రాణి గురించే కదా సార్..అని గోపీచంద్ అన్నారు. దీంతో ప్రభాస్ ఒరేయ్ ఇరికించకురా అంటూ ఎక్స్ప్రెషన్ చేశారు.
2008 లో ఏదో హీరోయిన్ కోసం గొడవ పడ్డారని విషయం తెలుస్తోందని బాలయ్య అడగగా.. మనోడే పడేస్తాడో వాళ్ళ కటౌట్ చూసి పడిపోతారో అర్థం కాలేదని బాలయ్య అనగా.. చెప్పేరా నేనైతే పడలేదు నీకు ఏమైనా ఉంటే చెప్పు అంటూ గోపీచంద్ ఇరికించారు ప్రభాస్. ఆ తరువాత బాలయ్య ఒక ఫోటో చూపించగా సార్ మా అమ్మ కంగారు పడిపోద్ది అంటూ తెలిపారు. గోపి ఆ ఫోటో తీసింది నువ్వే అని బాలయ్య అనగా రేపు సోషల్ మీడియాలో నేను తట్టుకోలేని ప్రభాస్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.