తెలుగు సినీ పరిశ్రమలో రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పేరు పొందారు. ప్రభాస్ కూడా తన పెదనాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందుతూ చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కృష్ణంరాజు అనారోగ్య సమస్యతో మృతి చెందారు.
అయితే కృష్ణంరాజు ప్రభాస్ కోసం చేసిన పనులు సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా వైరల్ గా మారుతున్నాయి. ప్రభాస్ కు ఇష్టం లేకపోయినా తన పెదనాన్న చెప్పాడని కారణంతో ఒక హీరోయిన్ తో రొమాన్స్ చేశారట. ఆ చిత్రము ఏదో కాదు రెబల్ .. ఈ సినిమాని నటుడు ,డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా తమన్నా, దీక్ష సేథ్ నటించారు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ ని చవిచూసింది. అయితే ఇందులో అని ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం కృష్ణంరాజుకు చాలా నచ్చిందట.
ఇక ఈ సినిమాలోని ప్రభాస్ సరసన దీక్ష సేథ్ నటించింది. అయితే ఈ సినిమాలో మొదట అనుష్క శెట్టి ని తీసుకోవాలనుకున్నారట. ఆ పాత్రకి దీక్ష సేథ్ సెట్ అవుతుందని భావించి కృష్ణంరాజు కావాలనే ఆమెని హీరోయిన్గా తీసుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అలా రెబల్ సినిమాలో దీక్ష సేథ్ తో రొమాన్స్ చేయవలసి వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం తన పెదనాన్న మీద ఉన్న ప్రేమతోనే ఆ హీరోయిన్ తో బలవంతంగా రొమాన్స్ చేసినట్లుగా ప్రభాస్ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.