టాలీవుడ్ లో సింహాద్రి సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించింది అంకిత.. ఈమె అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె రస్నా యాడ్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత పలు సినిమాలలో నటించి కాస్త గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళ భాషలలో కూడా నటించింది.
అయితే అలాంటి హీరోయిన్ సడన్గా ఇండస్ట్రీలో మాయం అయిపోయింది. 2016లో బిజినెస్ మాన్ అయినా విశాల్ ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా అంకిత కెరియర్ ని మార్చేస్తుందని అలాగే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాలో ఉంటుందని అందరూ భావించారు.. కానీ అనుకున్న దానికి వ్యతిరేకంగా ఈమె సినీ కెరీర్ ఇండస్ట్రీలో తొందరగానే ముగిసిపోయింది.
అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో అంకిత మాట్లాడుతూ నా కెరీర్ దాదాపు అయిపోయింది అనే సమయంలో బాలకృష్ణ తో విజయేంద్ర వర్మ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాపైనే నా ఆశలన్నీ పెట్టుకున్నాను ఎందుకంటే ఆ సినిమా హిట్ అయితే మళ్లీ ఇండస్ట్రీలో కొనసాగువచ్చునని లేకపోతే ఇక్కడికే నా కెరీర్ ముగిసిపోతుందని అనుకున్నాను. బాలకృష్ణ సినిమా కాబట్టి చలా ఆశలతో ఆ సినిమాలో నటించాను.
కానీ చివరికి అది ఫ్లాప్ గా మిగిలింది. దాంతో నా సినీ కెరియర్ అక్కడికే ముగిసిపోయింది.
ఎందుకంటే ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలి అంటే కచ్చితంగా మన వెనుక సక్సెస్ అనేది ఉండాలి.ఒకవేళ సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో ఉండటం చాలా కష్టం అంటూ అంకిత చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈమె కెరియర్ ముగిసిపోవడానికి కారణం బాలయ్య చిత్రమైనని చెప్పవచ్చు.