ప్రతీ ఒక్కరి జీవితంలోనైనా కొంతకాలం బ్యాడ్ టైం నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎవరు ఎలాంటి పని చేసినా కూడా అందుకు భిన్నంగా ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి కష్టాలు కేవలం సాధారణ మనసులకే కాకుండా సిని సెలబ్రిటీలకు కూడా వస్తూ ఉంటాయని చెప్పవచ్చు. అలా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో కొన్ని కష్టాలను ఎదుర్కొన్నారు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 2009వ సంవత్సరం నుంచి 2014 వ సంవత్సరం వరకు బ్యాట్ టైం కొనసాగిందని గతంలో వార్తలు వినిపించాయిలు. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరియర్ పరంగా వ్యక్తిగతంగా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారట. 2009వ సంవత్సరంలో టిడిపి తరఫున ఎన్నికలలో ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయ్యింది. అయితే ఆ సమయంలో డాక్టర్లు ఎన్టీఆర్ను డ్యాన్స్ కు దూరంగా ఉండమని చెప్పినట్లు సమాచారం. కానీ ఎన్టీఆర్ మాత్రం సినిమాల పైన ఉండే ఇష్టంతో డాన్స్ ను ఇప్పటికీ వదల లేక పోతున్నారు.
ఎన్టీఆర్ ప్రచారం చేసిన కొన్ని నియోజకవర్గాలలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కథనాలు వినిపించాయి. ఇవి ఎన్టీఆర్ను చాలా బాధ పెట్టడమే కాకుండా తనను చాలా కృంగిపోయేలా చేశాయని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతూ ఉంటారు. 2010లో ఎన్టీఆర్ అదుర్స్, బృందావనం వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు. 2010 వ సంవత్సరంలో లక్ష్మీ ప్రణతి తో వివాహం జరగగా అప్పుడు ఆమె మైనర్ అనే కథనాలు కూడా వినిపించాయి. ఈ కథనాల వల్ల లక్ష్మీ ప్రణతి మేజర్ అయిన తర్వాతే ఆమెను వివాహం చేసుకున్నారు.
2011లో ఎన్టీఆర్కు శక్తి సినిమాతో భారీ డిజాస్టర్ పడింది. ఆయేడాదే ఊసరవెల్లి సినిమా కూడా చాలా నిరాశకు గురిచేసింది.దమ్ము సినిమా కూడా ఘోరమైన ఫ్లాప్ ను చూసింది. ఇక తర్వాత రామయ్య వస్తావయ్య రభస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆసమయంలోనే ఎన్టీఆర్ పైన పలు రకాలుగా వార్తలు వినిపించాయి. అలా ఆరేళ్లపాటు చాలా ఇబ్బందులు పడ్డాడట ఎన్టీఆర్ 2015లో టెంపర్ సినిమాతో తన కెరియర్ను మార్చుకున్నారు. ఇక తర్వాత వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి