సినీ ఇండస్ట్రీలో ఈమధ్య ఒక ఫ్యాషన్ గా తయారయింది విడాకుల వ్యవహారం.. చాలామంది సినీ సెలబ్రిటీలు ఈమధ్య విడాకులు తీసుకుంటూ బంధాన్ని విడగొట్టుకుంటున్నారు. గత కొన్నేళ్ల క్రితం నాగచైతన్య, సమంత వీరిద్దరి జంట విరిపోవడం అందరికీ బాధని కలిగించింది.. ఒకప్పుడు చూడ ముచ్చటగా ఉండే ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకొని వేరువేరుగా ఉంటూ వారి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.

ఇండస్ట్రీ వాళ్లకి పెళ్లి అంటే ఒక బొమ్మలాట అయింది. ఎందుకంటే నచ్చితే పెళ్లి చేసుకుంటారు నచ్చకపోతే విడాకులు తీసుకుంటారు. తన లైఫ్ కోసం తమకు నచ్చినట్టు ఉండటం కోసం అడ్డుగా ఉన్న జీవిత భాగస్వాములను దూరం పెట్టేస్తారు. గత కొన్ని రోజుల నుండి ఈ టాపిక్ పై మెగా వారసురాలు నిహారిక కూడా విడాకుల బాట పట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ ఈమధ్య సోషల్ మీడియాలో జంటగా కనపడటం లేదు.

నిహారికకు సినిమా అవకాశాలు కాస్త తక్కువే అయినా కూడా వెబ్ సిరీస్ లతో బాగా బిజీగా ఉంటోంది.కానీ ఒక వైపు ప్రేక్షకులు మాత్రం ఈమెపై బాగా మండిపడుతున్నారు.తను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలేసి.. మంచి జీవితాన్ని తను నాశనం చేసుకుంటుంది అంటూ అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా చెప్పాలంటే కొణిదెల ఆడపడుచులు మెగా ఫ్యామిలీ పరువు తీయటానికి ఉన్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఒకప్పుడు నిహారిక అంటే చాలా పద్ధతిగా ఉండేది. ఇప్పుడు శరీర భాగాలను కనిపించేలా బట్టలు వేస్తోంది.
దీనంతటికీ కారణం హీరోయిన్ సమంతానే అని అంటున్నారు. ఎందుకంటే తను కూడా తన భర్తను వదిలిపెట్టి లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తోంది.. ఈమెను చూసి చాలామంది హీరోయిన్స్ ఆదర్శంగా తీసుకుంటున్నారు. భర్తను వదిలేసి కూడా సింగిల్ గా బతకవచ్చు అని ప్రూఫ్ చేసింది సమంతనిజానికి నిహారికకు, సమంతా అంటే చాలా ఇష్టం ప్రతి విషయంలోనూ నిహారిక సమంతను ఫాలో అవుతూ ఉంటుంది. అంటే దీన్నిబట్టి నిహారిక ,సమంత విడాకులను ఫాలో అయినట్టు ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.