నరేష్ రెండవ భార్యకి విడాకులు ఇచ్చి తప్పు చేశాడా.. కారణం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

Rekha Supriya.. ప్రముఖ సీనియర్ హీరో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నరేష్ (Naresh) మూడు వివాహాలు చేసుకున్నారన్న విషయం తెలుసు. కానీ ఒక్కొక్క భార్య బ్యాక్ గ్రౌండ్ ఇటీవల కాలంలో ఒక్కొక్క రకంగా బయటపడుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే నరేష్ రెండవ భార్యగా ప్రపంచానికి ఏమాత్రం పరిచయం లేని రేఖా సుప్రియ (Rekha Supriya) గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఎంతో ఉన్నతమైన కుటుంబంలో జన్మించింది రేఖా సుప్రియ.. ప్రముఖ గేయ రచయిత అభ్యుదయ వాది అయిన దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రికి స్వయాన మనవరాలు.

అంతేకాదు బుజ్జాయి రచయిత సుబ్బరాయ శర్మకు కుమార్తే.. ఈమె సోదరుడు, సోదరి అలాగే కుటుంబ సభ్యులంతా కూడా మంచి రచనలు చేసేవారే.. రేఖ సుప్రియ తండ్రి సుబ్బరాయ శర్మ (Subbaraya sharma) కు విజయనిర్మల (Vijayanirmala)కు మంచి స్నేహం ఉండేది. అందుకే నరేష్ కు ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె కోరుకుంది. మొదట్లో ఒప్పుకోకపోయినా ఆ తర్వాత ఒప్పించి మరీ పెళ్లి జరిపించారు. తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. నవీన్ , తేజ అనే ఇద్దరు పిల్లలు పుట్టాక నరేష్ తో విడాకులు తీసుకుంది రేఖా సుప్రియ. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల ముఖ్య కారణం తేజకు ఆటిజం అనే సమస్య ఉండడమే.

నరేష్ రెండవ భార్య రేఖ సుప్రియ కొన్ని కోట్ల మందికి ఆదర్శం అని మీకు తెలుసా | Untold Facts About Naresh Second Wife Rekha Supriya Details, Naresh Second Wife, Rekha Supriya, Actor Naresh Wife ...

మంద బుద్ధితో తేజ చిన్నతనం నుంచి సమస్యను ఎదుర్కొన్నాడు. వారి శరీరం పెరుగుతోంది కానీ మెదడు మాత్రం ఎదగలేదు. అందుకే వారి పనులు వారు చేసుకోలేకపోవడమే కాదు భోజనం కూడా చేయలేరు. ఎంత వయసు వచ్చినా చిన్న పిల్లల్లోనే ప్రవర్తిస్తూ ఉంటారు. తేజ కూడా ఆటిజం సమస్యతో ఉన్నాడని తెలియగానే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత విడిపోవాల్సి వచ్చింది.. నవీన్ కస్టడీ కోరుతూ నరేష్ కేసు వేయగా అతడు తన తండ్రి దగ్గరే ఉండాలని కోర్టు తీర్పునిచ్చింది. దాంతో చిన్నపిల్లాడిని మాత్రం రేఖా సుప్రియ తన దగ్గరుండి పెంచింది.

కొడుకును అలా చూసి తల్లడిల్లిపోయిన రేఖ.. తన కొడుకులాగా.. తనలాగా ఎవరు ఇబ్బంది పడకూడదని ఒక ఆర్గనైజేషన్ ను కూడా ప్రారంభించి.. ఆ సంస్థ ద్వారా ఆటిజంతో బాధపడుతున్న 25 మంది అనాధ పిల్లలను ఆమె దత్తత తీసుకుంది. అంతేకాదు వారి బాగోగులు చూసుకోవడమే కాకుండా పెద్దపెద్ద స్కూల్స్లో వారిని చదివిస్తోంది తేజ పూర్తిగా ఇప్పుడు మామూలు వ్యక్తి అయ్యాడు. మంచి పెయింటర్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన వేస్తున్న పెయింటింగ్స్ లక్షల్లో అమ్ముడుపోతున్నాయి.. నిజంగా ఇంత గొప్ప మానవతావాది కలిగిన భార్యను నరేష్ వదులుకోవడం నిజంగా అతని మూర్ఖత్వం అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Share.