టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఈమె టాలీవుడ్లో మొదట చందమామ సినిమా ద్వారా తెలుగుతరకు పరిచయమయ్యింది. ఈమె నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్గా నిలిచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి.. ఒక రకంగా చెప్పాలి అంటే కాజల్ అగర్వాల్ నటించిన సినిమాలు సక్సెస్ అవుతాయి కాబట్టి హీరోలు కూడా ఏమైనా ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది.
తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అగ్ర హీరోల సరసన నటించి పలు రికార్డులను సైతం అందుకుంది ఈ ముద్దుగుమ్మ .కెరియర్ పరంగా ఈమెపై ఎలాంటి వివాదాలు లేవు.. కానీ ఇప్పుడు కూడా కాంట్రవర్సీలకు దూరంగానే ఉంటుంది. కానీ కాజల్ కెరియర్ మొదట్లో కేవలం ఒక్క హీరోతోని ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి.. ఆ హీరో ఎవరో కాదు ప్రభాస్.. కాజల్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ సినిమాలు ఎంతో అద్భుత విజయాలను అందుకున్నాయి.
అయితే డార్లింగ్ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసిన వారంతా వీరిద్దరూ కచ్చితంగా ప్రేమలో ఉన్నారని రూమర్లను తెగ వైరల్ గా చేశారు. ముఖ్యంగా ఈ జోడి సరైన జోడి అంటూ కూడా కామెంట్లు చేయడంతో మరింత వైరల్ గా మారాయి. ఈ వార్తలపై ఒక ఇంటర్వ్యూలో స్వయంగా కాజల్ అగర్వాల్ అప్పట్లో స్పందించినట్లుగా సమాచారం. తన సినీ కెరియర్ ప్రారంభంలో ఇలాంటి రూమర్లు కేవలం ప్రభాస్ తో మాత్రమే వచ్చాయి దాన్ని నేను పాజిటివ్ గానే తీసుకున్నానని తెలియజేసింది.
అలా ఎందుకు చేశానంటే ప్రభాస్ కూడా చాలా స్వీట్ పర్సన్ మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు..కేవలం స్నేహితులు మాత్రమే అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ ఈ విషయం పైన ఎప్పుడు స్పందించలేదు. ప్రభాస్ కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితులు గౌతమ్ కిచ్లూ నీ ప్రేమించి మరి వివాహం చేసుకొని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది ఇప్పటికి కూడా పలు సినిమాలలో నటిస్తూనే ఉంది కాజల్ అగర్వాల్.