బాలీవుడ్లో మొదట జాగో అంటూ సినిమా ద్వారా పరిచయమయ్యింది హీరోయిన్ హన్సిక ఇందులో చైల్డ్ డైరెక్టర్ గా నటించింది.ఆ తర్వాత 2007లో దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధం ఏమిటంటే జాగో లో చిన్న పిల్ల గా కనిపించిన హన్సిక మోత్వాన్ని దేశముదురు లో ఒకేసారిగా హీరోయిన్గా పేరు సంపాదించింది.నాలుగేళ్లలోనే హీరోయిన్ గా మారడంతో ఈ విషయం చర్చనీ అంశంగా మారింది.
కేవలం జాగోలోనే కాదు చైల్డ్ యార్టిస్టుగా హన్సిక అప్పటికే చాలా సినిమాలలో నటించింది.ఆమె ఉన్నట్టుండి హీరోయిన్గా తెరపై కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అదే సమయంలో ఆమె హార్మోన్ల ఇంజక్షన్ తీసుకొని యుక్త వయసుకు ఎదిగినట్టుగా కనిపిస్తోందని వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయట. అయితే ఇలాంటి రూమర్లు కేవలం హన్సిక మీదే కాకుండా చాలామంది హీరోయిన్ల పైన కూడా వచ్చాయి. ఈ విషయంపై హన్సిక తల్లి ఇన్ని రోజులకు రియాక్ట్ కావడం జరిగింది. తాజాగా హన్సిక పెళ్లికి సంబంధించి ఒక వీడియో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది.
అందులో హన్సిక తల్లి తెలియజేస్తూ అవన్నీ బోగస్ వార్తలే అంటూ కొట్టి పడేసింది.ఒకవేళ తన కూతురుకు తాను హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చి ఉంటే తాను చాలా ధనికురాలిని అయి ఉండాలని హన్సిక తల్లి వ్యాఖ్యానించింది.టాటా బిర్లాల స్థాయి ధనుకులే అలాంటి ఇంజక్షన్లు కొనగలరని ఆమె తెలియజేయడం జరిగింది. రాసే వాళ్ళు కామన్ సెన్స్ లేకుండా రాస్తారని విరుచుకుపడుతోంది తమ పంజాబీలమని పంజాబీ ఆడపిల్లలు 12 నుంచి 16 సంవత్సరాల వయసు మధ్యనే అలా ఎదగడం మామూలే అంటూ వివరించింది. హన్సిక టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకుంది.