సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ కామెంట్లు తప్ప నెగటివ్ కామెంట్లు చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అన్ని విషయాలలో ప్రూఫ్ చేసుకున్నప్పుడే వారికి స్టార్ స్టేటస్ అనేది వస్తుందని చెప్పవచ్చు. ప్రముఖ సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న నిజం విత్ స్మిత అనే పేరుతో సోనీ లీవ్ లో ఒక షోని ప్రారంభం చేయబోతున్నారు. ఈ షోకు సినీ సెలబ్రెటీలతోపాటు రాజకీయ నాయకుల సైతం హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫస్ట్ గెస్ట్ గా ఈ షో కి చిరంజీవి హాజరు కావడం జరిగింది అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది.
ఇక ఈ ప్రోమోలో చిరంజీవి జగిత్యాలలో తనపై కోడిగుడ్లు విసిరారు అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో భాగంగా జగిత్యాలకు వెళ్లిన సమయంలో.. ఈ దాడి జరిగినట్లుగా తెలిపారు చిరంజీవి. దీంతో రాజకీయాలకు దూరం కావడానికి కూడా ఈ అవమానాలు కారణం అంటూ కొంతమంది అభిప్రాయంగా తెలియజేయడం జరుగుతోంది. ఈ ఘటన జరిగిన సమయంలో కోడిగుడ్లు తలకు రాసుకుంటే మంచిదని చిన్నప్పుడు చెప్పారని అవి వేసేవాళ్ళు సంస్కారాన్ని నిలుపుకుంటున్నారని చిరంజీవి గతంలో తెలియజేశారు.
ఈ ఘటన అప్పట్లో మెగా అభిమానులను చాలా బాధ పెట్టింది. ఈ సమయంలోనే కొంతమంది మంచివాళ్లు ప్రజలకు నచ్చారని కామెంట్స్ కూడా చేశారు. దీంతో చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటుండేది అందుకే అన్నట్లుగా సమాచారం.. అయితే చిరంజీవికి సహాయం మాత్రమే తెలుసు అని అభిమానులు భావిస్తున్నారు. ఇక చిరంజీవి స్థాపించిన పార్టీపై కూడా ఎన్నో ఫేక్ ప్రచారాలు రావడంతో ఆ పార్టీకి మైనస్ గా మారింది. ఇలాంటివి ఎన్నో అవమానాలు భరించారు కాబట్టి ఈయన మెగాస్టార్ అయ్యారని కొంతమంది తెలియజేస్తున్నారు.