తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ప్రత్యేకమైన స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు. అయితే గతంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న చిరంజీవి తాజాగా వాల్తేర్ వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్లలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
వాల్తేరు వీరయ్య ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే తన పైన వచ్చిన కొన్ని కామెంట్లకు కూడా రియాక్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన స్పందిస్తూ పొరుగు రాష్ట్ర రాజకీయాల గురించి నాకెందుకు అని తెలియజేశారు. ఆ రాజకీయాలు నాకు వద్దంటూ కూడా చెప్పేశారు. మీరు పేపర్లలో ఏం చూస్తారో తెలియదు ఏం పరిశీలిస్తారో తెలియదు అంతకంటే తక్కువగా నేను కూడా పరిశీలిస్తాను.. నా ఇంటికి పేపర్లు కూడా రావని తెలియజేశారు చిరంజీవి.
కేవలం తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉందని రాజకీయాల మీద అసలు లేదని తెలియజేశారు. నా ఓటు హక్కు ఎక్కడైతే ఉందో ఆ రాష్ట్రంలో ఉండి మాట్లాడుతున్నాను.. నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. మా ఇంట్లో వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అని అనుకోను.. పొలిటికల్ లోకి వెళతానంటే తన ఇష్టము తన ఇండిపెండెంట్ వ్యక్తి అంటూ తెలియజేశారు చిరంజీవి. ఇక తన తమ్ముడి వెనుక కూడా తను లేనని ఎన్నోసార్లు చెప్పానని అయినా కూడా తన పేరు వినిపిస్తూనే ఉంటుందని తెలిపారు చిరు. దీంతో రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసారా అని వార్తలు వినిపిస్తున్నాయి.