స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆయన నేషనల్ వైడ్ గా కూడా అన్ని భాషలలో అభిమానులను సంపాదించారు. అంతకుముందే సౌత్ లోనే తమిల్, మలయాళం లో కూడా ఫాన్స్ ఉండేవారు. పుష్ప సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు. పుష్ప సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు. దీంతో ఈయన పైన భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోని అల్లు అర్జున్ కు సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.
ఇక అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట ఎంతో అన్యోన్యంగా జీవిస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే స్నేహ రెడ్డి కంటే ముందు అల్లు అర్జున్ ఒక స్టార్ హీరోయిన్ ని ప్రేమించారట.ఆ విషయాన్ని ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో తెలియజేయడం జరిగింది. అల్లు అర్జున్ మొదట్లో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ని ప్రేమించారట. అయితే ఆమెను చూడడం కోసం అల్లు అర్జున్ ఎన్నో ప్రయత్నాలు చేశారని తెలియజేశారు.
కానీ ఆమెకు వివాహమైనప్పుడు చాలా బాధపడ్డానని అల్లు అర్జున్ తెలియజేశారు. ఇప్పటికి తనకు ఐశ్వర్య రాయ్ అంటే చాలా క్రష్ ఉందని తెలియజేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఏ కాకుండా ఎంతోమంది హీరోలు సైతం అప్పట్లో ఐశ్వరరాయ్ కలల రాకుమారిగా పేరుపొందింది. ఇక ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ వివాహం చేసుకుంది వీరికి ఒక పాప కూడా ఉన్నది.