టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. నటనపరంగా ఎంతోమంది అభిమానులను సంపాదించిన అల్లు అర్జున్ ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచూ యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్ రేంజ్ లో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.
ఇక పలు రకాల ఫోటో షుట్లను షేర్ చేస్తూ ఓ రేంజ్ లో రెచ్చిపోతూ ఉంటుంది.అల్లు అర్జున్ ,స్నేహ రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం కలదు. వీరిది ప్రేమ వివాహం వీరిద్దరూ ప్రేమించుకొని మరి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు అల్లు అర్జున్, స్నేహ పెళ్లి బంధంతో ఒకటయ్యారు.. స్నేహ రెడ్డిని ప్రేమించినటువంటి అల్లు అర్జున్ వివాహానికి ముందే స్నేహ రెడ్డిపై తనకు ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని ఒక కానుక రూపంలో తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్, స్నేహ రెడ్డి నిశ్చితార్దానికి ముందు రోజు ఏకంగా లక్షలు విలువ చేసి కొన్ని ఖరీదైన బహుమతులను గిఫ్ట్ గా పంపించారట. ఈ విధంగా అల్లు అర్జున్ ఇచ్చిన బహుమతులు చూసిన అల్లు కుటుంబ సభ్యులు స్నేహ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. పెళ్లికి ముందే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కోసం ఎలాంటి కానుకలు కొన్నారు వాటి ధర విషయానికి వస్తే..
అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కోసం ఏకంగా లక్ష రూపాయలు విలువైన డిజైనర్ చీరని నిశ్చితార్థం కోసం గిఫ్ట్ గా ఇచ్చారట అలాగే రూ .60 లక్షల రూపాయలు విలువ చేసే ఒక డైమండ్ రింగ్ తో పాటు నగలు కూడా ఇచ్చినట్లు సమాచారం. తనకు కాబోయే భార్య కోసం లక్ష విలువ చేసి ఖరీదైన కానుకలు ఇవ్వడంతో స్నేహారెడ్డి అంటే అల్లు అర్జున్ కు ఎంత ప్రేమ ఉందో అంటే పలువురు నెట్టేసన్లు కామెంట్లు చేస్తున్నారు.