సినీ నటుడు చలపతిరావు గడిచిన కొన్ని గంటల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.. అయితే ఎప్పుడు కూడా సినిమాలలో అందరినీ నవ్విస్తూ ప్రేక్షకులను కూడా నవ్విస్తూ ఉంటారు. దాదాపుగా 1200 కు పైగా చిత్రాలలో నటించిన ఈ నటుడు తన సినీ జీవితంలోనే కాకుండా నిజ జీవితంలో కూడా పలు కష్టాలను ఎదుర్కొన్నట్లుగా ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇక అసలు విషయంలోకి వెళ్తే చలపతిరావుని చూసి యంగ్ వయసులో ఉన్నప్పుడే ఒక అమ్మాయి ఇష్టపడిందట. అయితే ఆ అమ్మాయి ఇష్టపడిందనే కారణంతో తన కుటుంబాన్ని ఎదిరించి మళ్ళీ వివాహం చేసుకున్నారట.ఆ తర్వాత కొంతకాలానికి కుటుంబ సభ్యులను ఒప్పించి ఇంటికి తీసుకువెళ్లిన కొన్ని సంవత్సరాలకే ఆమె పలు అనారోగ్య సమస్యతో మరణించిందట. అయితే ఆ సమయంలో తనకి రవిబాబు అనే కుమారుడు ఉన్నాడు. అప్పుడు తన వయసు ఏడు సంవత్సరాలట. దీంతో చలపతిరావు కు మళ్ళీ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా చేసుకోలేదట.
ఇక పెద్దయ్యాక చలపతిరావు కొడుకు రవిబాబు కూడా తన తండ్రికి రెండో వివాహం చేయాలని ఎంత ప్రయత్నించినా ఒప్పుకోలేదట. చలపతిరావు ఎప్పుడు పైకి సరదాగా కనిపించిన చలపతిరావు జీవితంలో కూడా కొన్ని విషాదాలు ఉన్నాయి. సిల్లీ ఫెలోస్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగిందట. దాదాపుగా ఒక ఏడాది పాటు చక్రాల కుర్చీకే పరిమితమయ్యారట. ఆ సమయంలో తన కంటి చూపు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. కానీ అలాంటి సమయంలో బోయపాటి శ్రీను తనకు అవకాశం ఇచ్చారని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక ఫంక్షన్ లో మహిళలను ఉద్దేశించి చలపతిరావు చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి.. దీంతో తన మీద కొంతమంది నెగటివ్ కామెంట్లు చేయడమే కాకుండా ట్రోలింగ్ జరపడంతో చనిపోవాలనుకున్నారట ఆ తర్వాత తన కుటుంబం మాటలు విని ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారని సమాచారం.