దృశ్యం 3,4 ,5 సీక్వెల్స్ వస్తాయా..? ఇందులో నిజమెంత..?

Google+ Pinterest LinkedIn Tumblr +

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, సీనియర్ హీరోయిన్ మీనా కలసి నటించిన కుటుంబ కథా చిత్రం దృశ్యం. వరుణ్ అనే కుర్రాడిని మీనా, తన కూతురు కలసి చంపితే వారి కుటుంబాన్ని పోలీసుల నుంచి రక్షించుకోవడం కోసం ఒక తండ్రిగా వెంకటేష్ ఎలాంటి ఆలోచనలు చేశాడు అనేది మనం దృశ్యంలో చూసాము. ఈ సినిమాకు సీక్వెల్ గా గా దృశ్యం 2 వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అదే కుటుంబం, అదే పోలీస్ ఆఫీసర్ ల తో కొనసాగుతూ సరికొత్తగా చమ్మక్ చంద్ర, వేణు, అవినాష్ వంటి పలువురు కమెడియన్ లను నటించేలా చేయడం గమనార్హం.

ఇకపోతే దృశ్యం 2 సినిమాలో వరుణ్ అస్థిపంజరాల కోసం పోలీసులు వెతుకులాటలో విక్టరీ వెంకటేష్ దొరికాడా..? అయితే మొదటి సినిమాలో తప్పించుకున్న విక్టరీ వెంకటేష్ దృశ్యం 2 సినిమా లో పోలీసులకు చిక్కాడా లేక ఈసారి కూడా తప్పించుకున్నాడా..? ఈ నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమా చివర్లో తప్పు ఒప్పుకున్న వెంకటేష్.. తన తెలివితో ఏం జరుగుతుందో ముందే ఊహించి.. అటు పోలీసులను ఇటు కోర్టును ఎలా బోల్తా కొట్టించాడు.. మనకు ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఉత్కంఠగా సాగిన ఈ సినిమా ట్విస్టులతో కొనసాగడం చాలా అద్భుతంగా ఉంది. వరుణ్ అస్తిపంజరం కోసం దృశ్యం సినిమాలో వరుణ్ తల్లిదండ్రులు కోరినప్పుడు వెంకటేష్ ఏమాత్రం స్పందించడం.

కానీ దృశ్యం టు సినిమాలో వరుణ్ ఆస్తి పంజరాన్ని వారి తల్లిదండ్రులకు అప్పగిస్తాడు వెంకటేష్. ఎటువంటి సాక్ష్యాలు లేనందున కోర్టు కూడా ఈ కేసును కొట్టివేసింది.. ఇక కథ ముగిసింది కాబట్టి మూడు, నాలుగు ,ఐదు సీక్వెల్స్ వస్తాయనేది కేవలం అపోహ మాత్రమే..

Share.