ఇండియన్ క్రికెట్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని, హీరోయిన్ లక్ష్మీరాయ్ దాదాపుగా విడిపోయి 12 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. కానీ జనాలు మాత్రం ఈ విషయం మర్చిపోలేదు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మీ రాయ్ మళ్లీ ఈ విషయం గురించి మాట్లాడింది. వివాహం కాని లక్ష్మీరాయ్ ధోని పేరుని మీడియాలో హైలెట్ చేస్తోంది. ధోనీతో ఉన్న రిలేషన్ ఓ మచ్చల మిగిలిపోయిందని తెలియజేసింది.
12 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా ధోని మాజీ లవర్ అంటూ కామెంట్ చేస్తున్నారని ఆమె తెలియజేసింది. నాకు వివాహమై, పిల్లలు కలిగిన తర్వాత కూడా ధోనీ తో తనకు ఉన్న రిలేషన్ గురించి ఆ పిల్లలకి చెబుతారేమో అంటూ సెటైర్ వేసింది. అయితే మేమిద్దరం ఒక సంవత్సరం పాటు డేటింగ్లో ఉన్నామని ఆ తరువాత ఇద్దరి అంగీకారంతో ను విడిపోయామని తెలియజేసింది.
అయితే ఇప్పటివరకు వీరిద్దరి గురించి మీడియాలో ఎటువంటి వార్త రాలేదు. అయితే ఇప్పుడు ఎందుకని ధోని ప్రస్తావన తీసుకు వచ్చిందో తెలియడం లేదు.అయితే లక్ష్మీ రాయ్ ఇలా ధోనీ పేరును వాడుకోవడం వల్ల తన పబ్లిసిటీ పెరుగుతూ ఉందని నెటిజన్లు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.