చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోని సంవత్సరాలుగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ధోని రిటైర్మెంట్ విషయంపై తను తాజాగా ఒక స్పష్టతను ఇచ్చాడు. ధోని ఐపీఎల్ 6లో అని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను ఐపీఎల్ మ్యాచ్ చెన్నై లో ఆడతానని స్పష్టం చేశాడు.
శనివారం చెన్నైలో csk ఐపీఎల్ 2021 టైటిల్ సెలబ్రేషన్స్ బాగానే జరిగాయి. ఇందులో పాల్గొన్న ధోనీ తన మనసులో మాటను తెలియజేశాడు. నేను నా క్రికెట్ కెరియర్ ను ఎప్పుడు ప్లానింగ్ తోనే కొనసాగించాను. నా చివరి అంతర్జాతీయ మ్యాచ్ స్వదేశంలో రాంచీలో ఆడాను, అలాగే నా ఆఖరి మ్యాచ్ ను చెన్నై లో ఆడాలని కోరుకుంటున్నాను.
అయితే తన ఆఖరి మ్యాచ్ ఈ ఏడాది ఉంటుంది.. ఐదేళ్ల తర్వాత ఉంటుందని మాత్రం చెప్పలేనిది లోని ట్వీట్ చేశాడు. ఐపీఎల్ ప్లాట్ఫామ్ చాలా గొప్పది. ఎంతో మంది యువ క్రికెటర్లకు తమ టాలెంట్ ను నిరూపించుకో డానికి బాగా ఉపయోగపడుతుందని తెలియజేశాడు. ఐపీఎల్ ముందుకు తీసుకువెళ్లడానికి నాతోపాటు నా సహచర క్రికెటర్లుతో పాటు, బీసీసీఐ కూడా ఎంతో కృషి చేసింది అని తెలియజేశాడు ధోనీ.