కోలీవుడ్ సూపర్ స్టార్ గా ధనుష్ కి ఎంత ప్రత్యేకత అయితే ఉందో.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఇంకా చెప్పాలి అంటే ధనుష్ కంటే సల్మాన్ ఖాన్ కే దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో టైటిల్ కోసం పెద్ద పెద్ద వివాదాలు చెలరేగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఒక్కోసారి కోర్టు వరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరో ధనుష్ కోసం తన టైటిల్ ని వదులుకోవడం గమనార్హం.
వివరాల్లోకెళ్తే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఆత్రంగీరే అనే సినిమా చేశాడు ధనుష్.. ఈ సినిమాలో హీరోయిన్ గా సారా అలీ ఖాన్ నటించగా, అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈనెల 24వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇకపోతే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ మాట్లాడుతూ..ఆత్రంగీరే సినిమా టైటిల్ తో పాటు రక్షాబంధన్ టైటిల్ ని కూడా అక్షయ్ కుమార్ హీరోగా రిజిస్టర్ చేయడానికి తీసుకున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ ను రిజిస్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక సమస్య వచ్చిందట.. రక్షా బంధన్ సినిమా రిజిస్టర్ చేశారు కానీ వేరే సినిమా చేయడానికి కుదరదని చెప్పారట..
కానీ సల్మాన్ ఖాన్ ముందే రిజిస్టర్ చేయించుకున్నారని అతడికే రైట్స్ ఉన్నాయి వారు చెప్పారట. ఆనంద్ ఎల్ రాయ్ వెంటనే సల్మాన్ కి ఫోన్ చేసి విషయం చెప్పగా.. ఆనంద్ ఎల్ రాయ్ అడిగితే అతనికి మాత్రమే టైటిల్ ఇవ్వమని..మరెవరికీ ఇవ్వవద్దని చెప్పారట సల్మాన్.. సల్మాన్ తన మీద చూపిస్తున్న ప్రేమ చూసి పొంగిపోయాడట ఆనంద్ ఎల్ రాయ్.