టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ జంటగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న చిత్రం ” హలో గురు ప్రేమ కోసమే “. ఇది ఒక కంప్లీట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్ ని చూస్తుంటే అర్ధం అవుతుంది. ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని జె ఆర్ సి హాల్ ఘనంగా నిర్వహించారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ వేదిక పై నిర్మాత దిల్ రాజు హీరోయిన్ అనుపమ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియా లో హాల్ చల్ చేసింది.
ఇక ఇదే వేడుకలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతుంటే హీరో రామ్ వెనక నుంచి దేవిశ్రీని మాట్లాడనివ్వకుండా మైక్ పట్టుకుని ఆయన్ని మాట్లాడనివ్వలేదు. ఇది చుసిన వెంటనే రామ్ అభిమానులంతా గట్టిగ తెగ కేకలు వేశారు. వీరిద్దరూ ఉన్న ఫోటో ని హీరోయిన్ అనుపమ షేర్ చేస్తూ ” చాల రొమాంటిక్ ” అని కామెంట్ పెట్టటం విశేషం. ఇక ఈ రోజు దేవి శ్రీ ప్రసాద్ ఈ ఫోటోకి రిప్లై చేస్తూ ” నాకు తెలిసి రామ్‌కు ఉన్న ఫీమేల్ ఫ్యాన్స్ అందరూ ఈ ఫోటో లో నన్ను చూసి కుళ్లుకుంటూ ఉంటారు ” నువ్వేమంటావ్ అనుపమ? అని ఆమెని అడిగారు. హలో గురు ప్రేమ కోసమే చిత్రం దసరా కానుకగా ఈ నెల 18 వ తేదీన విడుదల కానుంది.
😂🤣😂🤣😂🤣
I guess all d female fans of @ramsayz wud be Jealous of me nowwwww !! 😂🤣😂🤣😂
What do U say @anupamahere ?!? https://t.co/aPzYk4EF3M
— DEVI SRI PRASAD (@ThisIsDSP) October 16, 2018