నాగార్జున, నాని హీరోలుగా నటించిన భారీ మల్టిస్టారర్ చిత్రం ” దేవదాస్ ” గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విడుదలైన తొలి రోజు నుండే హిట్ టాక్ తో దూసుకుపోతుంది దేవదాస్. సినిమా లో వచ్చే కామెడీ ప్రేక్షకులకి నచ్చటంతో సినిమాకి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావటం జరిగింది. శ్రీరాం ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాని వైజయంతి బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించారు.
ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 11.54 కోట్ల గ్రాస్, 6.76 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు
నైజాం : 1.45 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.57 కోట్లు
గుంటూర్ : 0.53 కోట్లు
ఈస్ట్ : 0.39 కోట్లు
వెస్ట్ : 0.26 కోట్లు
కృష్ణా : 0.36 కోట్లు
నెల్లూరు : 0.53 కోట్లు
సీడెడ్ : 0.73 కోట్లు
ఏ పీ/ టీ ఎస్ : 4.55 కోట్లు
కర్ణాటక: 1.20 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.25 కోట్లు
ఓవర్సీస్ : 0.75 కోట్లు
వరల్డ్ వైడ్ కలక్షన్స్ : 6.76 కోట్లు