దేవదాస్ కు ‘U/A’ సర్టిఫికెట్.. సెప్టెంబర్ 27న విడుదల..
నాగార్జున, నాని హీరోలుగా నటించిన సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ‘U/A’ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. వికే నరేష్, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ చిత్రంలో సహాయ పాత్రల్లో నటించారు. మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికే హిట్ అయింది. ఈ సినిమాకు స్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ బాలీవుడ్ మీడియా గ్రూప్ వయాకమ్ 18తో కలిసి అశ్వినీదత్ దేవదాస్ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాకి మణి శర్మ స్వరాలూ సమకూర్చగా, శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.
