టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోయిన్స్ ఇ మధ్య కాలంలో పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ తమన్నా కూడా ఒకరు. గతంలో వరస సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన తమన్నా ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే కాకుండా సరైన సక్సెస్ కూడా అనుకోలేదు. దీంతో పలు లేడి ఓరియంటెడ్ సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు కూడా రాలేదు.. ఆకట్టుకునే అందం అభినయం అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆకట్టుకోలేకపోతోంది. చివరిగా గుర్తుందా శీతాకాలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె పాత్ర పెద్దగా గుర్తింపు రాలేదు.
ఇక ఈ ఏడాది బాలీవుడ్ లో బబ్లీ బౌన్సర్ అనే పేరుతో సినిమాను విడుదల చేయగా ఇది కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే కాకుండా రాంగ్ స్టెప్ వేసిందని చాలామంది ఆమెను కామెంట్లు చేయడం జరిగింది. అయితే తమన్నా చేసిన ఓ పని వల్ల ప్రస్తుతం ఇమే కు అవకాశాలు తగ్గిపోయాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. మొదట హ్యాపీ డేస్ సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించిన తమన్నా ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మిల్కీ బ్యూటీగా పేరుపొందింది.
అలా ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు అవకాశాలు రావడంతో అక్కడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.అక్కడ సినిమాలలో నటిస్తున్న సమయంలో ఒక హీరోతో ప్రేమలో పడిందని వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఆ సమయంలో తమన్నా రేంజ్ స్టార్ హీరోయిన్ రేంజ్ గా ఉండేదట.. కానీ ఆ హీరోకి స్టార్డం లేకపోయినా సరే ఆ హీరో ప్రేమలో పడి తన పరువు పోగొట్టుకుంది తమన్నా అన్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి.
మంచి మంచి ఆఫర్లు వస్తున్న సమయంలోనే వాటిని రిజెక్ట్ చేసి కోలీవుడ్లో హీరోతో పలు చిత్రాలను నటించడంతో ఇమే కెరియర్ ఒక్కసారిగా పడిపోయింది. అయితే చివరికి ఆ హీరో మాత్రం తమన్నాని మోసం చేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు సమాచారం. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాల్సి ఉంది.