దేశవ్యాప్తంగా పేద ప్రజల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత రెండు సంవత్సరాల నుంచికరోనా వైరస్మ. హమ్మారి కారణంగా భారత్‌లో పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు నీతిఆయోగ్ వెల్లడించింది.రాష్ట్రాల వారీగా పేదరికనీ నీతి ఆయోగ్ విడుదల చేసింది. నిరుపేదలు ఎక్కువ గా ఉన్న రాష్ట్రాల లో బీహార్ అగ్రస్థానంలో ఉంది. బీహార్‌లో 51.91 శాతం మంది పేదలు ఉన్నారని మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ద్వారా నీతి ఆయోగ్ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ (37.79 శాతం), మధ్యప్రదేశ్ (36.65 శాతం), మేఘాలయా (32.67 శాతం) ఉన్నావి.
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నిరుపేదల జాబితాలో తెలంగాణ 18వ స్థానంలో, ఏపీ 20వ స్థానంలో నిలిచాయి. తెలంగాణలో 13.74 % మంది పేదలు ఉన్నారని. ఏపీలో 12.31% మంది పేదలు ఉన్నారని నీతి ఆయోగ్ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ తెలిపింది.
అతి తక్కువ నిరుపేదలు అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేరళలో 0.71 శాతం మాత్రమే పేదలు ఉన్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. ఆ తర్వాత గోవా (3.76 శాతం), సిక్కిం (3.82 శాతం), తమిళనాడు (4.89 శాతం), పంజాబ్ (5.59 శాతం) ఉన్నావి.