దీప్తి-షణ్ముఖ్ విడి పోతున్నారా.. ఆ పోస్టులకు అర్థం అదేనా?

Google+ Pinterest LinkedIn Tumblr +

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గురించి మనందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో పలు వీడియోల ద్వారా యూత్ లో బాగా క్రేజ్ తెచ్చుకున్న ఇతను అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడని అందరూ భావించారు. కానీ చివర్లో రన్నరప్ గా నిలిచాడు. ఎంతో క్రేజ్ తో హౌస్ లోకి అడుగుపెట్టిన షణ్ముక్ బోలెడంత నెగిటివిటీని మూటగట్టుకొని మరి బయటకు వచ్చాడు. దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్నాడు అన్న విషయాన్ని మరచి,సిరి తో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ హగ్గులు, కిస్సులతో బోలెడంతా నెగిటివిటిని మూటగట్టుకున్నాడు.ఈ విషయం పట్ల నెటిజెన్స్ కూడా వారిద్దరి పై దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు.

ఇదిలా ఉంటే ఈ విషయంలో దీప్తి సునైనా దీప్తి సునైనా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో కనీసం నీ మనస్సాక్షితో అయినా నిజాయితీగా ఉండు అని రాసుకొచ్చింది. ఆ తర్వాత నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయని తెలిసినప్పటికీ నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా ఈ సంవత్సరం నాకు బాగా అనిపించలేదు..కానీ చాలా నేర్చుకున్నాను అంటూ వరుసగా చాలా పోస్టులు చేసింది. ఇవి చూసిన నెటిజన్లు షణ్ముఖ్ , సునైనాల మధ్య గొడవలు జరిగాయా అని ఆరా తీస్తున్నారు. దీప్తి సునైనా పెట్టిన పోస్టులను చూస్తుంటే వీరిద్దరూ త్వరలోనే విడిపోయేలా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ విషయంపై లవ్ బర్డ్స్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Share.