బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో దీపికా పదుకొనే కూడా ఒకరు.. ఈమె రేంజ్ ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్గా పేరుపొందింది. దాదాపుగా 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు హాలీవుడ్, టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తరచు ఇంటర్వ్యూలలో పలు ఈవెంట్లలో సోషల్ మీడియాలో తరచూ అందాల ఆరబోతతో అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
అయితే దీపిక పదుకొనే చేసిన కామెంట్లు ఎప్పటికప్పుడు వివాదానికి దారి తీసేలా ఉంటాయి. కానీ అవన్నీ ఆమె మాత్రం అసలు పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు మరొకసారి అలాంటి కామెంట్లు చేసింది ఈ ముద్దు గుమ్మ.. దీపికా పదుకొనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక చెత్త సలహా ఇచ్చారు నీ యద భాగాలను పెంచుకో అప్పుడే నీకు మంచి లుక్ వస్తుందని చెప్పారట.దాంతో తనకు చిరాకు వచ్చిందని ఆ వయసులో నాకు అలాంటి సలహాలు ఇస్తారని అసలు నేను అనుకోలేదని తెలియజేసింది.
అయితే ఆ కామెంట్లను తాను మాత్రం సీరియస్ గా తీసుకోవడం మానేశానని బాలీవుడ్లోకి వచ్చిన మొదట్లో కూడా చాలామంది డైరెక్టర్లు చెత్త కామెంట్లు చేశారని.. అసలు నీది హీరోయిన్ ఫేస్ ఏనా అంటూ చాలామంది అవమానించారని తెలియజేసింది.. కానీ నేను ఏంటనే విషయం నాకు మాత్రమే తెలుసు అదే నన్ను ఈ రోజు మీ ముందు నిలబెట్టింది అంటూ ఎమోషనల్ అవుతూ తెలియజేసింది దీపికా పదుకొనే.. గడిచిన కొన్నేళ్ల క్రితం నటుడు రణవీర్ సింగ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది దీపికా పదుకొనే.
ఇప్పటికే కూడా ఇద్దరూ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక దీపికా పదుకొనే సినిమాలలో కూడా గ్లామర్ వలకబోయడంలో సిద్ధంగానే ఉంటుంది తనకు నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమే అంటుంది దీపికా పదుకొనే.