బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పై తాజాగా ట్రోలింగ్స్ జరిగాయి. దీపికా పదుకొనే కు సోషల్ మీడియాలో ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా బ్యూటీ ఏమాత్రం తగ్గకుండా అదే రీతిలో సినిమాలు చేస్తూ కొనసాగుతోంది. ఈమె హీరో రణ్ వీర్ సింగ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీపికా పదుకొనే డ్రెస్సింగ్ స్టైల్ పై అభిమానులు దారుణంగా ట్రోలింగ్స్ చేశారు. అసలేం జరిగిందంటే…
తాజాగా దీపికా పదుకొనే ముంబై ఎయిర్ పోర్టుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే ఆమె బ్లూ డెనిమ్ జాకెట్, లైట్ బ్లూ కలర్ డెనిమ్ ప్యాంటు ధరించింది. ఇంతవరకు బాగున్నా ఆమె కాళ్ళకు హీల్స్ అలాగే సాక్స్ కూడా గడిచింది. ఈ ఫోటోలపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. నీ భర్త రన్వీర్ సింగ్ బట్టలు వేసుకుని వచ్చావా అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు హీల్స్ లోకి సాక్స్ వేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి ఫ్యాషన్ ను యూత్ ఫాలో కావద్దు అని పలువురు హితవుపలికారు.